Publish Date: Sat, 19 Sep 2015 (22:09 IST)
Updated Date: Sat, 19 Sep 2015 (22:13 IST)
తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి మలయప్ప స్వామి సర్వ భూపాల వాహనంపై తిరుమాడవీధుల్లో ఊరేగుతున్నారు. శ్రీదేవి భూదేవిల సమేతుడైన స్వామి చిన్ని కృష్ణుడి అవతారంలో జనానికి దర్శనం ఇస్తున్నారు. ఆయనను దర్శించుకున్న జనం భక్తి పారవశ్యంతో పులకించిపోయారు.
రాత్రి 9 గంటలకు స్వామి వాహనమండపం నుంచి ఊరేగింపునకు బయలుదేరారు. ఆయన దర్శనం కోసం వచ్చిన భక్తులు తిరుమాడ వీధులలో వేచి ఉన్నారు. వారు చేస్తున్న గోవింద నామస్మరణతో మాడ వీధులు మారు మ్రోగుతున్నాయి.