Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సండ్ర అరెస్టు..! టీటీడీ పాలకమండలిపై మరకలు..!?.. ఏం చేస్తారు?

Advertiesment
sandra
, బుధవారం, 8 జులై 2015 (10:38 IST)
వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక ఆలయం. ఆధ్యాత్మిక భావన, భగవంతుని ధ్యానం తప్ప మరోటి వినిపించని దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే ఇన్నాళ్లకు టీటీడీ పాలకమండలిపై మరక పడింది. నోటుకు ఓటు కేసు తిరుమల తిరుపతి దేవస్థానంపై ఓ మచ్చ వేసింది. పాలకమండలి సభ్యులుగా ఉన్న సండ్ర వెంకట వీరయ్య అరెస్టుతో టీటీడీని నీలినీడలు వెంటాడుతున్నాయి. సభ్యుడిగా ఉన్న సండ్రను ఏం చేస్తారు..? సభ్యులుగా తొలగిస్తారా..! అలాగే కొనసాగిస్తారా..!! పాలకమండి ఛైర్మన్ విదేశాలలో ఉన్నారు.. ఈవో మౌనంగా ఉన్నారు. జపాన్ నుంచి రాగానే ఏం చేస్తారనేది ప్రశ్న..
 
ఓటు నోటు కేసు అన్ని సంస్థలను దాటుకుని ఎక్కడో తిరుపతిలోని ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి తగిలింది. ఆ ప్రకంపనాలతో టీటీడీ పాలకమండలిని కుదిపేస్తున్నాయి. ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకట వీరయ్య అరెస్టు కావడంతో టీటీడీపై మరకులు పడ్డాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.. పాలకమండలిలోని మిగిలన పాలకమండలి సభ్యులు  తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. వేంకటేశ్వర ఆలయానికి 1933 నుంచి ధర్మకర్తల మండలి... ఆ తరువాత పాలకమండలి వచ్చాయి. 
 
అయితే ఇప్పటి వరకూ పాలకమండలిలో ఏ ఒక్క సభ్యుడు కూడా అరెస్టయిన ఘటన లేదు. ఓటుకు నోటుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేకపోయినా సండ్ర పాలకమండలి సభ్యుడుగా ఉండడమే మరకకు కారణ అవుతుంది. కాకపోతే, ధార్మిక సంస్థల పాలకమండలిలో ఇలాంటి వారు ఉండడంపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఇలాగే వాన్‌పిక్ భూముల వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఎల్వీ సుబ్రమణ్యం కూడా ఈవోగా ఉన్న సమయంలో ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. 
 
ప్రస్తుతం అరెస్టయి రిమాండ్‌లో సండ్రను టీటీడీ నుంచి తొలగిస్తారా.. లేదా.. అనే విషయంపై ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే పాలకమండలి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అమెరికా ఉన్నారు. అదే సమయంలో ఈవో ఈ విషయంపై నోరు మెదలేని స్థితిలో ఉన్నారు. ఓటుకు నోటులో కేసు అధికార తెలుగుదేశం పార్టీ అభియోగాలను ఎదుర్కుంటోంది కాబట్టి టీటీడీ చర్యలకు జంకుతోందని తెలుస్తోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి జపాన్‌లో  ఉన్నారు. అయితే ఆయన వచ్చినా చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది.  
 

Share this Story:

Follow Webdunia telugu