దేవుడిని అర్థం చేసుకోవచ్చా....?
నేను కూడా ఇటీవలే దేవుడిని అర్థం చేసుకోవడం అనే గ్రంథాన్ని చూశాను. ఈ పుస్తకం బాగా ప్రాచుర్యం పొందిందనుకుంటాను. వారు దేవుని అర్థం చేసుకుంటున్నారు. మిమ్మల్ని సృష్టించిన వాడిని మీరు ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు? మీరిప్పుడు ఉన్నతస్థాయికి భిన్నమైన స్థాయిలో
నేను కూడా ఇటీవలే దేవుడిని అర్థం చేసుకోవడం అనే గ్రంథాన్ని చూశాను. ఈ పుస్తకం బాగా ప్రాచుర్యం పొందిందనుకుంటాను. వారు దేవుని అర్థం చేసుకుంటున్నారు. మిమ్మల్ని సృష్టించిన వాడిని మీరు ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు? మీరిప్పుడు ఉన్నతస్థాయికి భిన్నమైన స్థాయిలో ఉన్నదానిని మీరు అర్థం చేసుకోలేరు. మొత్తం ప్రయత్నమంతా ఒక స్థాయి నుంచి మరో స్థాయికి వెళ్లేందుకే. నేను అర్థం చేసుకోలేను అన్న విషయాన్ని గుర్తించాలి. అర్థం చేసుకోవలసిన అవసరమే లేదు. అనుభవమే మిమ్మల్ని ఈ స్థాయి నుంచి ముందుకు తీసుకువెళుతుంది.
ఇది చాలా చిన్నవిషయం. దీన్ని అలా ఉంచండి. భారతదేశం నుంచి మీకోసం ఓ ఊరగాయ తెప్పిస్తాను. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు అర్థం చేసుకోలేరు. మీరు దానిని నోటిలో పెట్టుకుంటే అది భగ్గుమంటుంది. అది వేరే విషయం. మీరు కూర్చుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు అర్థం కాదు. ఈ పువ్వును అర్థం చేసుకోండి.
మీకేం అర్థమవుతోంది. ఈ పూవును అర్థం చేసుకునేందుకు రెమ్మలను ఒక్కొక్కటికీ విడదీస్తారు. కానీ మీకేమీ అర్థం కాదు. మహా అయితే పూవుకు చెందిన రసాయనశాస్త్రం అర్థం అవవచ్చు. అప్పుడు అందులో ప్రొటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్లు ఉన్నాయని నిర్దారణ చేస్తారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ పూవు గురించి మీకేమి అర్థం కాదు. పూవునే అర్థం చేసుకోలేనివారు దేవుడిని ఎలా అర్థం చేసుకోగలరు?