తిరుమలలో సోమవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 25 కంపార్ట్‌మెంట్లు నిండాయి. వీరికి శ్రీవారి దర్శనం కోసం కనీసం 16 గంటల సమయం పడుతోంది. కాలి నడకన వచ్చే భక్తులు 5 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరికి కనీసం దర్శనం కోసం 6 గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక దర్శనం నుంచి వచ్చే భక్తులకు కనీసం 2 గంటల సమయం పడుతోంది. సెలవులు కావడంతో క్రమేణా తిరుమల రద్దీ పెరుగుతోంది. గదల కోసం భక్తులు క్యూలైన్లలో కనీసం రెండు గంటల సమయం వేచి ఉండక తప్పడం లేదు.