Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పట్టువస్త్రాల సమర్పణ నా పూర్వ జన్మ సుకృతం... ఇదే రోజు నదుల అనుసంధానం స్వామి దయ

Advertiesment
River
, బుధవారం, 16 సెప్టెంబరు 2015 (20:57 IST)
తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించే అవకాశం రావడం తన పూర్వ సుకృతమని రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. బుధవారం రాత్రి ఆయన తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వేంకటేశ్వర స్వామి దయవలననే తాను రాష్ట్రంలో ఇన్నిపనులు చేయగలుగుతున్నామని అన్నారు. నదులు అనుసంధానం కూడా ఆయన దయాదాక్షిణ్యాలు చల్లని చూపుల కారణంగానే సాధ్యమైందని చెప్పారు. 
 
రాష్ట్ర ప్రజలందరిని దయతో చూడాలని తాను కోరుకున్నట్లు తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం బ్రహ్మోత్సవాల సమయంలోనే జరుగడం తనకు ఎంతో ఆనందగా ఉందని చెప్పారు. సకాలంలో వర్షాలు కురిసి దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని తాను స్వామిని ప్రార్థించినట్లు చెప్పారు. 
 
 
 

Share this Story:

Follow Webdunia telugu