Publish Date: Fri, 10 Jul 2015 (22:08 IST)
Updated Date: Fri, 10 Jul 2015 (22:10 IST)
పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు వస్తారనీ, వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అందించే సేవలు పుష్కర స్నానం కంటే మిన్నగా ఉండాలని తిరుమల సంయుక్త కార్యదర్శి శ్రీనివాస రాజు తెలిపారు. శుక్రవారం ఆయన తిరుమలలో రాజమండ్రికి డిప్యుటేషన్ పై వెళ్లుతున్న టీటీడీ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు.
అక్కడ తాము నమూనా ఆలయంలోగానీ, తమ సంస్థ అందిస్తున్న ప్రదేశాలలోకి వచ్చే భక్తులకు అందించే సేవలు చాలా ఉన్నతంగా ఉండాలని ఆయన ఉద్యోగులను కోరారు. 500 మంది ఉద్యోగులతో పాటు 650 మంది వాలంటీర్లను అక్కడకు తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు.