Publish Date: Wed, 23 Sep 2015 (11:17 IST)
Updated Date: Wed, 23 Sep 2015 (11:22 IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం శ్రీవెంకటేశ్వరస్వామి వారికి మహా రథోత్సవం వైభవంగా సాగింది. రథోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది. దేవేరులతో కలిసి సర్వాంగ సుందరంగా ముస్తాబైన మలయప్పస్వామి రథంపై తిరుమాఢ వీధుల్లో వూరేగారు.
రథంలోంచే భక్తులకు దర్శనం ఇచ్చారు. వేలాది మంది భక్తులు గోవింద నామ స్మరణ చేస్తూ స్వామివారి రథోత్సవంలో పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, తిరుపతి జేఈవో, తిరుపతి ఎస్పీ సహా పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.