Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అవునా...! అంతసేపు ఉంటారా..!! శ్రీవారి ఆలయంలో 40 నిమిషాలపాటు గడపనున్న రాష్ట్రపతి

అవునా...! అంతసేపు ఉంటారా..!! శ్రీవారి ఆలయంలో 40 నిమిషాలపాటు గడపనున్న రాష్ట్రపతి
, బుధవారం, 1 జులై 2015 (07:50 IST)
దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శ్రీవారి దర్శనం కోసం తిరుమల వస్తున్నారు. సతీసమేతంగా విచ్చేస్తున్న ఆయన ఆలయంలో కనీసం 40 నిమిషాలపాటు గడపనున్నారు. స్వామి సేవలో పునీతం కావాలనే ఆయన తపనతో సర్వదర్శనానికి ఒకటిన్నర గంటలపాటు బ్రేక్ పడనున్నది. మూలమూర్తులకు సేవలు, ఆర్జిత సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు.  తిరుపతికి ఉదయం 10 గంటల ప్రాంతంలో విచ్చేస్తారు. అక్కడ నుంచే ఆయన ఆలయ దర్శనం ప్రారంభమవుతుంది. వివరాలిలా ఉన్నాయి. 
 
రేణిగుంట విమానాశ్రయం నుంచి ఉదయం 11 గంటలకు ఆయన తిరుచానూరు చేరుకుని, చోళప్పగార్డెన్‌లో హైందవ సంప్రదాయం ప్రకారం కీపాసు, కండువా ధరించి అమ్మవారి ఆలయంలో ప్రవేశిస్తారు. పది నిమిషాలపాటు కుంకుమార్చన సేవలో పాల్గొని, ప్రసాదాల స్వీకరణ, ఆశీర్వచనాల తర్వాత 11.20 గంటలకు వెలుపలకు వస్తారు. ఈ సందర్భంగా 10 నుంచి 11:30 వరకు సర్వదర్శనాన్ని రద్దు చేయడంతోపాటు 10 నుంచి 12:30 మధ్య కల్యాణోత్సవాన్ని ఏకాంతం చేశారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు కపిలతీర్థ పుష్కరిణిని సందర్శించాక కపిలేశ్వరస్వామిని రాష్ట్రపతి దర్శనం చేసుకుని, అభిషేక సేవలో పాల్గొంటారు. 
 
తర్వాత పక్కనే ఉన్న కామాక్షి అమ్మవారి కుంకుమార్చన సేవలో, నవగ్రహ శాంతి పూజలోనూ పాల్గొంటారు. ఊంజల్‌సేవ మంటపంలో వేదపండితుల ఆశీర్వాదాలు, ప్రసాదాలు స్వీకరించి 1:27 గంటల ప్రాంతంలో తిరుమలకు బయలుదేరతారు. స్వామివారి ఆలయంలో శ్రీవారి దర్శనం, వేదపండితుల ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాల స్వీకరణ తదితరాలలో 40 నిమిషాలు గడుపుతారు. దీనికిముందు వరాహస్వామి ఆలయాన్ని దర్శిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి 1.45 గంటలపాటు సర్వదర్శనానికి బ్రేక్‌ ఇవ్వనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu