Publish Date: Thu, 23 Apr 2015 (07:07 IST)
Updated Date: Thu, 23 Apr 2015 (06:41 IST)
తిరుమలలో గరువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలలో బుధవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 40,513 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 4 కంపార్ట్‌మెంట్లూ నిండిపోయాయి. కనీసం 3గంటల సమయం పడుతోంది.
నడక దారి వచ్చే వారు రెండు కంపార్టుమెంట్లలో నిండి ఉన్నారు. వారికి శ్రీవారి దర్శనానికి వీరికి 2 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం నుంచి తిరుమలకు చేరుకునే భక్తుల సంఖ్య క్రమేణా పెరుగవచ్చు. పాఠశాలలకు సెలవులు రానుండడంతో తిరుమల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఉచిత, రూ.50 గదులు భక్తులకు సులభంగా లభిస్తున్నాయి. రూ.50, రూ.100,రూ.500 గదుల కోసం భక్తు లు వేచి ఉన్నారు.