తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలలో మంగళవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 44,120 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 2 కంపార్ట్‌మెంట్లూ నిండిపోయాయి. కనీసం 2 గంటల సమయం పడుతోంది.
నడక దారి వచ్చే వారు రెండు కంపార్టుమెంట్లలో నిండి ఉన్నారు. వారికి శ్రీవారి దర్శనానికి వీరికి 2 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం నుంచి తిరుమలకు చేరుకునే భక్తుల సంఖ్య క్రమేణా పెరుగవచ్చు. ఉచిత, రూ.50 గదులు భక్తులకు సులభంగా లభిస్తున్నాయి. రూ.50, రూ.100,రూ.500 గదుల కోసం భక్తు లు వేచి ఉన్నారు.