బ్రహ్మోత్సవాలలో భక్తులు కోరినన్ని లడ్డూలు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. భక్తులు తమ బంధువులకు ఇచ్చుకోవడానికి తీసుకెళ్ళవచ్చునని ఆయన చెప్పారు. ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టికెట్ల జారీని పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 26 నుంచి అక్టోబరు వరకు 25,577 సేవా టికెట్లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు.
ఈ నెల 29 న ఏపీ, తెలంగాణలో ‘మన గుడి’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. 45వేల ఆలయాల్లో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపడతామన్నారు. రేపటినుంచి ఈ నెల 16 వరకు నెల్లూరులో శ్రీవారి వైభవోత్సవం చేస్తున్నామన్నారు. 100 రోజుల వరకు తిరుమలలో నీటి సమస్య ఉండదని త్వరలో టన్ను బంగారాన్ని డిపాజిట్ చేస్తామని చెప్పారు.