Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్మలు చేయకుండా ఎవడూ ఒక్క క్షణం కూడా ఉండలేడు... శ్రీకృష్ణుని సందేశం

కర్మలు చేయనంత మాత్రాన పురుషుడు కర్మ బంధాలకు దూరంగా ఉండలేడు. కేవలం కర్మ సన్యాసం వల్ల కూడా ఆత్మజ్ఞానం లభించదు - కృష్ణుడు. కర్మలు చేయకుండా ఎవడూ ఒక్క క్షణం కూడా ఉండలేడు. ప్రకృతి గుణాల ప్రభావాలకు లోనై ప్రతివాళ్లూ అన్యంత్రులై కర్మలు చేస్తూనే ఉన్నారు - కృష్

కర్మలు చేయకుండా ఎవడూ ఒక్క క్షణం కూడా ఉండలేడు... శ్రీకృష్ణుని సందేశం
, శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (21:39 IST)
కర్మలు చేయనంత మాత్రాన పురుషుడు కర్మ బంధాలకు దూరంగా ఉండలేడు. కేవలం కర్మ సన్యాసం వల్ల కూడా ఆత్మజ్ఞానం లభించదు - కృష్ణుడు.
కర్మలు చేయకుండా ఎవడూ ఒక్క క్షణం కూడా ఉండలేడు. ప్రకృతి గుణాల ప్రభావాలకు లోనై ప్రతివాళ్లూ అన్యంత్రులై కర్మలు చేస్తూనే ఉన్నారు - కృష్ణుడు.
పైకి అన్ని కర్మేంద్రియాలను అణచిపెట్టి మనసులో మాత్రం విషయ సౌఖ్యాల గురించి ఆలోచించే అవివేకిని కపటాచారం కలవాడు అంటారు - కృష్ణుడు.
 
అర్జునా! మనసుతో జ్ఞానేంద్రియాలను స్వాధీనంలో ఉంచుకొని, కర్మేంద్రియాల ద్వారా నిష్కామ కర్మ చేస్తున్నవాడు ఉత్తమడు - కృష్ణుడు
నీ కర్తవ్యకర్మ నీవు ఆచరించవలసిందే. కర్మలు విడిచి పెట్టడం కంటే చేయడమే శ్రేయస్కరం. కర్మలు చేయకుండా నీవు జీవనయాత్ర కూడా సాగించలేవు - కృష్ణుడు
యాగ సంబంధమైనవి తప్ప తక్కిన కర్మలన్నీ మానవులకు సంసారబంధం కలగజేస్తాయి. కనుక ఫలాపేక్ష లేకుండా దైవప్రీతి కోసం కర్మలు ఆచరించు - కృష్ణుడు
 
పార్థా! ఇలా తిరుగుతున్న జగత్ చక్రాన్ని అనుసరించని వాడు పాపి. ఇంద్రియ లోలుడు. అలాంటి జీవితం వ్యర్థం - కృష్ణుడు
ఆత్మలోనే ఆసక్తి, సంతృప్తి, సంతోషం పొందేవాడికి విద్యుక్త కర్మలేవీ ఉండవు - కృష్ణుడు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీ వేంకటేశ్వరుని సతీమణివి అగు ఓ లక్ష్మీదేవీ