Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్యూ కాంప్లెక్సులోనే తిరుమల లడ్డూ టోకెన్లు

Advertiesment
tirumala
భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ టోకెన్ల పంపిణీలో మార్పులు తీసుకు వచ్చింది. రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్సులో అదనపు లడ్డూ టోకెన్ల జారీని శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో  చిన్నంగారి రమణ సోమవారం ప్రారంభించారు. ఈ అదనపు లడ్డూ టోకెన్ల కౌంటర్లను త్రిలోక్‌ కాంట్రాక్టు సంస్థ సౌజన్యంతో టీటీడీ ఏర్పాటు చేసింది. 
 
క్యూకాంప్లెక్సులో అందుబాటులో ఉన్న యాక్సస్‌ కార్డు జారీ సమయంలోనే అవసరమైన భక్తులకు అదనపు లడ్డూ టోకెన్లను మంజూరు చేస్తున్నారు. కాగా, ఈ క్యూలైన్‌లో వెళ్లే ఒక్కో భక్తుడు రెండు రాయితీ, రెండు అదనపు లడ్డూ టోకెన్లు చొప్పున నాలుగింటిని పొందవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu