Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి ఆలయంపై ఎగిరిన జెట్ విమానం...! ఎన్నిమార్లు చెప్పినా లెక్కలేదు..!!

Advertiesment
Jet flight
, గురువారం, 20 ఆగస్టు 2015 (11:51 IST)
నిన్న ఎయిరిండియా విమానం.. నేడు జెట్ విమానం రేపు మరో విమానం ఇలా విమానాలు శ్రీవారి ఆలయంపైనే ఎగురుతున్నాయి. నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించమని ఎన్ని మార్లు చెప్పినా బీజేపీ ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నన్నినాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి ట్రస్టీలం మేమే అన్నంతగా వ్యవహరించిన బీజేపీ నాయకులు నోరు మెదపడం లేదు. 
 
తిరుమల ఆలయంపై విమానాల ప్రయాణం మంచిది కాదని ఆగమశాస్త్ర పండితులు, టీటీడీ అధికారులు చాలాకాలంగా చెబుతున్నారు. యావత్తు హిందూ సమాజం కొలిచే దేవుడిని అత్యున్నత స్థానంలో చూస్తామని, ఆయనపైనే ప్రయాణం చేయడం శాస్త్రపరంగా మంచిది కాదని చెబుతున్నారు. అందుకే నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని కోరుతున్నారు.
 
అయితే గతంలో ఎప్పుడో ఒక్కమారు విమానం ఇలాగే ప్రయాణించినందుకు బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. తిరుమలపై విమానాలు ఎగురరాదని హెచ్చరించారు. నానా హంగామా చేశారు. నేడు అదే నాయకులు అధికారంలో ఉన్నారు. ఇటు దేవస్థాన పాలక మండలిలో సభ్యులుగా కూడా ఉన్నారు. వారు కూడా కనీసం నోరు మెదపకపోవడం విశేషం. 
 
ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా కేంద్రం నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించడం లేదు. గతంలో తిరుమలకు విచ్చేసిన కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు మాత్రం ఆలయంపై విమానాలు నడపకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అయితే నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించాల్సింది రక్షణ శాఖ అని ఆయన వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu