Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల లడ్డూ తింటే అరుగుతుందా..! అందులోని జీర్ణ రహస్యమేమిటి?

webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2015 (10:32 IST)
తిరుమల వేంకటేశ్వర స్వామి లడ్డూ పిసిరంత దొరికితే మహా ప్రసాదమని కళ్ళకు అద్దుకునే నోట వేసుకునే భక్తులు కోట్ల సంఖ్యలో ఉంటారు. నోట్లో పడగానే కరిగిపోయి అమృతం తీసుకున్నంత హాయిగా అనిపించే ఆ మహా ప్రసాదం చరిత్ర ఏంటి? ఎప్పుడు పుట్టింది...? దానికి ఎందుకంత రుచి..? అది తింటే కడుపులో భారంగా ఉండదా..? మరింతగా ఆకలేస్తుందా..? అందులో జీర్ణశక్తిని పెంచే రహస్యమేమిటి? 
 
ఇది కేవలం తిరుమలలోనే దొరికే ప్రసాదం మరెక్కడా దొరకదు.  ఎవరు తయారు చేసినా అంతటి రుచి రాదు. రాబోదు. ఇది సత్యం.. చాలా మంది ప్రయత్నాలు చేసి వదిలేశారు. లడ్డూ తయారు చేసే విధానంలోనే ప్రత్యేకత కాదు. దానిని తయారు చేసే పోటు(వంటశాల) కూడా అలాగే ప్రత్యేకం.. ఏ ఫైవ్ స్టార్ హోటల్ కూడా దాని ముందు దిగదుడుపే అంటే ఆశ్చర్యం అక్కర లేదు. అంతటి శుభ్రత పాటిస్తారక్కడ. 
 
స్వామి వారి పోటునకు వేంకటేశ్వర స్వామి తల్లి వకుళమాతా దేవి బాధ్యత వహిస్తారట. అక్కడ తయారయ్యే ప్రసాదాలన్నీ ఆమె పర్యవేక్షణలో జరుగుతాయని నమ్ముతారు. అందుకే నేటికీ పోటులో మంట వేసే ముందు వకుళమాత దేవికి పూజ జరుగుతుంది. తరువాతే లడ్డూ ప్రసాదాల తయారీ మొదలు పెడతారు.. అన్ని చోట్ల బాగా ఎండిన పాతబడిన కట్టెలను మంట వేస్తే. ఇక్కడ తాజాగా ఎండిన వంటచెరకును వినియోగిస్తారు. అదీ మామూలుగా కాదు. వాటిని మండించడానికి ఆవు నెయ్యిని వినియోగిస్తారు. ఇక్కడ నుంచే లడ్డూ తయారీ ప్రత్యేకత మొదలవుతుంది. ఆవు నెయ్యి పోసి కట్టెలు మంట వేయడం వలన సులభంగా మండుకుంటాయట. 
 
అందులో ఏమేమి వాడుతారనేకంటే ఎప్పటి నుంచి లడ్డూ తయారీ ఉందనే అంశంపై చర్చ సాగుతుంది. రికార్డులను పరిశీలిస్తే దొరికి అంశఆ కాదది. లడ్డూ ఏ 75 యేళ్ళో.. వందేళ్ళో చరిత్ర కాదు. దానిని చెప్పడం అంత సులువు కాదు. అన్నమయ్య జీవిత చరిత్రను పరికించి చూస్తే అందులో లడ్డూ కనిపిస్తుంది. వేంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదాలలో లడ్డూ ఒకటి దర్శన భాగ్యం కలుగలేదని అన్నమయ్య తపిస్తూ గానం చేస్తూ వేంకటేశ్వర స్వామికి అర్పించిన ప్రసాదాలలో లడ్డూ కూడా ఉంది. అలాంటప్పుడు లడ్డూ వయస్సు చెప్పడం సముచితం కాదు. 
 
ఇక దానిలో రకరకాల దినుసులను వినియోగిస్తారు. నేతితో తయారు చేసే ఈ లడ్డు ఎంత తిన్నా కడుపులో భారం అనిపించదు సరికదా... ఎక్కడా జీర్ణసమస్య ఎదురయ్యే ప్రశ్నేలేదు. చాలా సులువుగా అరిగిపోతుంది. అంతటి మధురమైన ప్రసాదం లడ్డూ రుచి, వాసన అరుగుదల అన్ని ప్రత్యేకంగానే ఉంటాయి. అంటే ఆరోగ్య సూత్రాలను కూడా ఇందులో పాటించారన్నమాట. సాధారణ రోజుల్లో 1.2 లక్షల లడ్డూలను తయారు చేస్తారు. ఇక్కడి పోటునకు చాలా చరిత్రే ఉంది. ఎండవచ్చి వానొచ్చిన వరద వచ్చినా ఇక్కడ పోటునకు వచ్చి ఇబ్బంది ఏమి ఉండదు. రామానుజాచార్యులు ఇక్కడకు వచ్చే సమయానికే పోటు ప్రత్యేకంగా ఉంది. పల్లవ రాణి సమువాయి దేవుడికి ఎన్ని కానుకలు ఇచ్చినా, పోటునకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. 
 
ఆప్పటి నుంచి ఆలయంలోని పోటు అనునిత్యం వెలుగుతూనే ఉంది. ఇక లడ్డూలో ఏమేమి వాడుతారంటే జీడిపప్పు, ద్రాక్ష, అవునెయ్యి ఇలాంటివి ఎన్నో ఓ పద్దతి ప్రకారం వినియోగించడం వలననే అంతటి రుచి వస్తుందని చెబుతుంటారు. ఇప్పటికీ దాని రహస్యాన్ని ఛేదించలేకపోతున్నారు. దిట్టం(లడ్డులో వినియోగించే పదార్థాల) జాబితా ఇప్పటికీ ప్రత్యేకమే.  

Share this Story:

Follow Webdunia Hindi