Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ దుఃఖానికి మీరే కారణం.. ఇతరులు కానేకాదు.. సద్గురు

ప్రజలు బాధల్లో ఉండడానికి కారణం జీవితాన్ని అపార్ధం చేసుకోవడమే. దుఃఖానికి ఇతరులు కారణమని అనుకుంటే అది తప్పు. దుఃఖాన్ని ఎంచుకోవడం మీ తప్పే. దుఃఖంగా వుండటం వల్ల ఏదో ఒరుగుతుందనుకుంటే అదీ తప్పే. ఉదాహరణకి, మ

Advertiesment
మీ దుఃఖానికి మీరే కారణం.. ఇతరులు కానేకాదు.. సద్గురు
, గురువారం, 7 సెప్టెంబరు 2017 (11:17 IST)
ప్రజలు బాధల్లో ఉండడానికి కారణం జీవితాన్ని అపార్ధం చేసుకోవడమే. దుఃఖానికి ఇతరులు కారణమని అనుకుంటే అది తప్పు. దుఃఖాన్ని ఎంచుకోవడం మీ తప్పే. దుఃఖంగా వుండటం వల్ల ఏదో ఒరుగుతుందనుకుంటే అదీ తప్పే. ఉదాహరణకి, మీ కుటుంబంలో ఒకరు మీరు చేయకూడదనుకున్న దానిని చేయడం మొదలుపెడతారు. మిమ్మల్ని మీరు దుఃఖపెట్టుకుని, వారు మారుతారేమో అని ఆశిస్తూ, ఏడుపు మొహంతో తిరుగుతారు. వారు మారాలనే ఉద్దేశంతో మీకు మీరే దుఃఖం కలిగించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. 
 
అలా మీరు దుఃఖంతో ఉంటే, మీ చేతిలో స్వర్గమున్నా కూడా ఏం లాభం? అదే మీరొక ఆనందమయ వ్యక్తి అయినట్లైతే, మీ చేతిలో ఏది ఉన్నా, లేకపోయినా, ఎవరు పట్టించుకుంటారు?  మీరు నిజంగా ఆనందంగా ఉంటే, మీ దగ్గర ఏముంది, ఏం లేదు, ఎవరున్నారు, ఎవరు లేరు అన్న విషయాలు అంత ముఖ్యమైనవిగా కనిపించవు. అందుకే ఆనందం పట్ల శ్రద్ధ చూపించండి. దుఃఖాన్ని వదిలిపెట్టండి.
 
ఆధ్యాత్మికంగా ఉండటం అంటే ''నా ఆనందానికి నేనే మూలం'' అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. మీ ఆనందానికి మరెవరో మూలమని అనుకుంటే మాత్రం అది వ్యర్థం. అసలు మీలోని జీవం ఎప్పుడూ ఆనందంగా ఉండాలనే కోరుకుంటుంది. జీవితంలో అన్నీ వున్నా.. ఆనందం మాత్రం కరువైతే.. దుఃఖమే మిగులుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 07-09-17