Publish Date: Fri, 25 Sep 2015 (18:35 IST)
Updated Date: Fri, 25 Sep 2015 (18:37 IST)
ఇటీవల టీటీడీలో విలీనమైన చంద్రగిరి కోదండ రామాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సాంబశివ రావు తనిఖీ చేశారు. శుక్రవారం ఆయన ఆలయాన్ని సందర్శించి ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు.
కాణిపాకంలో వరసిద్ధ వినాయకునికి పట్టువస్త్రాలను సమర్పించడానికి వెళ్ళిన ఆయన తిరుగు ప్రయాణంలో చంద్రగిరిలోని ఆలయానికి వెళ్ళారు. అక్కడి సిబ్బంది ఆయన స్వాగతం పలికారు. దాదాపు 500 యేళ్ళ చరిత్ర కలిగిన ఆ ఆలయంలో చేయాల్సిన పరిస్థితులను పరిశీలించాలి.
తిరుమల తిరుపతి దేవస్థానం పురాతన ఆలయాలను కాపాడడం వాటి ప్రాశిత్యాన్ని కాపాదుతామని ఆయన అన్నారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని ఆయన చెప్పారు.