Publish Date: Tue, 08 Sep 2015 (17:46 IST)
Updated Date: Tue, 08 Sep 2015 (18:03 IST)
బ్రహ్మోత్సవాలు వస్తున్నాయ్.. అన్నింటికి మించి భక్తుల దగ్గర నుంచి ఒక్కమాట కూడా రాకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడా తేడా లేకుండా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సత్రాన్ని ఆమె తనిఖీ చేశారు.
క్యాటరింగ్ అధికారి శాస్త్రి, డిప్యూటీ కార్యనిర్వహణాధికారి సి రమణలతో కలసి ఆయన అన్న ప్రసాద క్యాంటీన్‌లో వసతులను పరిశీలించారు. భక్తులతో కలసి భోజనం చేశారు. వసతులపై వారిని అడిగి తెలుసుకున్నారు.