Publish Date: Thu, 24 Sep 2015 (21:52 IST)
Updated Date: Thu, 24 Sep 2015 (21:56 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. గురువారం రాత్రి తిరుమలలో ధ్వజావరోహణ కార్యక్రమాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది.
ఈ నెల 16 నుంచి నేటి వరకూ జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి. కొన్ని లక్షల మంది ఈ ఉత్సవాలను తిలకించారు. అశ్వయుజ మాసంలో శ్రీవారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ యేడాదిలో అదనపు బ్రహ్మోత్సవాలు రానున్నాయి.