ధనిష్ట పౌర్ణమితో కలిసినపుడు బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే పితృదేవతలకు పదివేల సంవత్సరాలు తరించే యోగం కలుగుతుంది. భాద్రపదంలో ఆర్ద్రా నక్షత్రంలో కూడిన పూర్ణిమవేళ శ్రాద్ధవిధులు ఆచరిస్తే పితృదేవతలకు యుగాంతం వరకూ పుణ్యలోకగతులు కలుగుతాయి.
మాఘ బహుళ అమావాస్య శతభిషా నక్షత్రంలో కలిసి వచ్చినప్పుడు శ్రాద్ధ విధి నిర్వర్తించడం వల్ల అత్యధిక పుణ్యం పితృదేవతలకు సిద్ధిస్తుంది.
పితృదేవతలకు పిండోదకాలు వదిలి, గంగాది జీవనదుల్లో స్నానం చేసే మోక్షగాములకు పాపములన్నీ నశించి అశేషఫలితాలు కలుగుతాయి.