రండీ బాబు... రండీ అభిషేకం టికెట్లను ఏర్పాటు చేస్తామంటూ విఐపీలను ఆకట్టుకునే ఓ దళారీ తిరుమలలో పట్టుబడ్డాడు. భక్తుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు అతనిని పట్టుకున్నారు. నిందితుడు గతంలో పోటు కార్మికుడుగా పని చేయడంతో తనకున్న పరిచయాలతో భక్తులతో బేరం ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.
తిరుమలలో హైటెక్ దళారిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. శ్రీవారి భక్తులకు దర్శనం కల్పిస్తానని, అభిషేకం సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ పలువురు భక్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు దళారిపైన భక్తులు ఫిర్యాదులు చేశారని పోలీసులు తెలిపారు.
గతంలో శ్రీవారి ఆలయంలో కాంట్రాక్ట్ పోటు కార్మికుడిగా దళారి పనిచేసేవాడని పోలీసులు తెలిపారు.