Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రహ్మోత్సవాలు... చిన్నశేష వాహనంపై కళ్యాణ వేంకటేశ్వరుడు

Advertiesment
ttd
, బుధవారం, 11 ఫిబ్రవరి 2015 (17:12 IST)
శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వేంకటేశ్వర ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో మలయప్ప స్వామి బుధవారం ఉదయం చిన్నశేష వాహనంపై శ్రీవారు ఊరేగారు. మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో ఆరంభమైనా ఉత్సవాలలో రెండో రోజున స్వామి అంగరంగ వైభవంగా తిరుమాడ వీధులలో ఊరేగారు. 
 
 తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. వాహన సేవ ఉదయం 9 గంటల నుంచి 11 వరకూ సాగింది. ఈ వాహన సేవలో కళాబృందాలు తన కళాచాతుర్యాన్ని ప్రదర్శించాయి. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈవో పోలా భాస్కర్, డిప్యూటీ ఈవో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu