Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను తప్పుడు మార్గాలను అనుసరించక తప్పదా..?

నేనొక పని చేయబోతున్నాను. లాభమొస్తుందో రాదోనని, విజయం లభిస్తుందో అపజయం కలుగుతుందో నని దానివల్ల సుఖం కలుగుతుందో దుఃఖం సంభవిస్తుందోనని మనసులో ఒకే ఆందోళన. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. తప్పుడు మార్గాలను అనుసరించక తప్పదా? నా ఆలోచన ఎలా ఉండాలి? నేనెలా నడుచ

Advertiesment
నేను తప్పుడు మార్గాలను అనుసరించక తప్పదా..?
, శనివారం, 27 ఆగస్టు 2016 (23:45 IST)
నేనొక పని చేయబోతున్నాను. లాభమొస్తుందో రాదోనని, విజయం లభిస్తుందో అపజయం కలుగుతుందో నని దానివల్ల సుఖం కలుగుతుందో దుఃఖం సంభవిస్తుందోనని మనసులో ఒకే ఆందోళన. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. తప్పుడు మార్గాలను అనుసరించక తప్పదా? నా ఆలోచన ఎలా ఉండాలి? నేనెలా నడుచుకోవాలి? ఏదీ శాంతిప్రదమైన మార్గం?
 
ఆందోళన వల్ల విజయం లభించదు. ఆందోళనతో కర్తవ్యాన్ని సరిగా నిర్వహింపలేకపోవచ్చు. అనుభవించవలసిన ఫలితం నీకోసం కాచుకునే ఉంది. అది ఎలాగూ నిన్ను వరిస్తుంది. దాని కోసం నీవు తప్పుడు మార్గాలను అనుసరించనక్కరలేదు. సుఖదుఃఖాలను లాభనష్టాలను సమానంగా భావించు. ఏది వచ్చినా సంతోషంగా భగవత్ర్పసాదమనే భావనతో అనుభవించడానికి సిద్ధంగా ఉండు. దీనివల్ల నీలో రాగద్వేషాది దోషాలు పెరిగి పాపాలు చేసే ప్రమాదం నుంచి తప్పుకుంటావు. కర్తవ్యం మరి నీవంతు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేలపై కూర్చుని భోజనం చేస్తే ఏంటి లాభం...?