Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోవిందా..! అపకీర్తి. తిరుమలలో భక్తురాలిపట్ల సిబ్బంది అసభ్య ప్రవర్తన.. విజిలెన్సుకు ఫిర్యాదు

Advertiesment
misbehaviour
, సోమవారం, 27 జులై 2015 (16:19 IST)
తిరుమలకు వచ్చే భక్తులను మర్యాదగా చూసుకుని వారిని తిరిగి పంపడంలో తిరుమ తిరుపతి దేవస్థానంలోని కొందరి కారణంగా అపఖ్యాతిని మూటగట్టుకుంటోంది. తాజగా శ్రీవారి సేవకులలోని ఒకరు తన భార్యపట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ రవి కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. 
 
హైదరాబాద్‌కు చెందిన రవికుమార్‌ అనే వ్యక్తి తన భార్యతో కలిసి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వెళ్లారు. ఈ క్రమంలో దర్శన సమయంలో శ్రీవారి సేవకుడు తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడని రవికుమార్‌ ఆరోపించారు. 
 
దీనిపై విజిలెన్స్‌ సిబ్బందికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదన్నారు. పైగా ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది బెదిరింపులకు దిగుతున్నారని రవికుమార్‌ ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu