ధర్మం అంటే ఏమిటి? మానవులు అనుష్టించాల్సిన ధర్మాలేంటి?
శాస్త్ర విహితమయిన కర్మలు "ధర్మం" అనబడతాయి. మన నడవడి, మన చేష్టలు, మన వృత్తి యితరులకు ఇబ్బంది కలిగించనవి, సజ్జనులకు హాని కలిగించని ధర్మం అనిపించుకుంటాయి. వ్యవస్థాగతంగా వున్న నియమాలు, సంఘ నియమాలు, సంస్కృతి నియమాలు ధర్మ మార్గాలు అనిపించుకుంటాయి.స్వాధ్వౌయం, బ్రహ్మచర్యం, దానం, యజనం, ఔదార్యం, సారళ్యం, దయ, అహింస, ఇంద్రియ విజయం, క్షమాగుణం, ఆత్మ సంయమనం, శుచిత్వం, సత్సం కల్పత్వం శివకేశవ భాస్కర దేవ్యౌదుల పట్ల భక్తి ఇవి మానవులు అనుష్టించవలసిన ధర్మాలు. వీటిలోనే వృత్తిరీత్యా కులం రీత్యా కొన్ని మార్పులు శాస్త్రాలలో చెప్పారు. ఉదాహరణకు అందరికీ అహింసయే పరమధర్మం అని చెప్పినా సైనికులకు మాత్రం శత్రుజయం ధర్మం అని చెప్పారు.