యోగా సాధనం అంటే చాలా మంది సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాపాయం, ధ్యానం, ముద్రలు, క్రియలు మాత్రమే కాదు. యోగా సాధానలో ముఖ్యమైనవి పతంజలి సూచించిన అష్టాంగ యోగ సూత్రాలు. ఈ సూత్రాలు ఎక్కువగా మనసుకి సంబంధించినవి. అనగా మనోసాధనకు సంబంధిచినవి. ఈ యోగ సాధన వల్ల కేవలం ఆరోగ్యంగా ఉండొచ్చని చాలా మంది అభిప్రాయం. నిజానికి యోగా సాధన వల్ల శారీరకంగా మానసికంగా దృఢంగా తయారుకావొచ్చు.
ఇందులో మానసికంగా చూస్తే...
* మనస్సు ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుంది.
* ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, గ్రహణశక్తి పెరుగుతుంది.
* ఆత్మవిశ్వాసం అలవడుతుంది.
* స్వీయ క్రమశిక్షణ వస్తుంది.
* స్వయం ప్రేరణ కలుగుతుంది.
* భావోద్వేగ నియంత్రణ అలవడుతుంది.
* అర్థం చేసుకునే సామర్థ్యం వస్తుంది.
* నేర్చుకునే సామర్థ్యం వస్తుంది.
* సహనం, జాలి, దయ పెరుగుతాయి.
* మానసిక స్థితి, ప్రవర్తనపై మంచి ప్రభావం చూపించే సెరటోనిస్ హార్మోన్ పెరుగుతుంది.
* భయాలు, బద్ధకాలు వదిలిపోతాయి.
* అనవసర ఆలోచనలు అదుపులోకి స్తాయి.
* చెడు అలవాట్లు తొలగిపోతాయి.