Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యోగా సాధనకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

యోగా సాధనకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
, మంగళవారం, 26 మే 2015 (16:49 IST)
నేటి జీవనశైలికి యోగా సాధన తప్పనిసరిగా మారిపోయింది. ఒత్తిడిని నివారించాలంటే తప్పనిసరిగా కొద్దిసమయమైనా వ్యాయామం చేయాలి. అయితే, ఒత్తిడిని తగ్గించడంలో యోగా తర్వాతే ఏదైనా. అయితే, యోగాసనాలు వేసే ముందు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించి తీరాల్సిన పరిస్థితి ఉంది.
 
 
ముందుగా ఆసనాలు, తర్వాత ప్రాణాయామం, ఆ తర్వాత ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం మాత్రమే కాదు అనారోగ్యాలు అంత త్వరగా దగ్గర చేరకుండా కూడా కాపాడుకోవచ్చు. ఒక గంట పాటు మీరు యోగసాధనకు కేటాయించాలనుకుంటే ముందుగా అరగంట పాటు ఆసనాలు, తర్వాత పదినమిషాల పాటు ప్రాణాయామం, ఆ తర్వాత ఇరవైనిమిషాల పాటు ధ్యానం చేయాలి. ఇలా సమయాన్ని కేటాయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. 
 
* యోగసానాలు 8 నుంచి 60 యేళ్ల మధ్య వయస్సున్న వారు మాత్రమే చేయాలి. 
* తెల్లవారు జామున నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మాత్రమే యోగసాధన మొదలుపెట్టాలి. ఎందుకంటే ఆసమయంలో గాలిలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. యోగసాధనకు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ప్రదేశాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. 
* వీలైనంత వరకు నిశ్శబ్ధంగా ఉండేలా చూడాలి. 
* పలుచని వస్త్రాన్ని నేల మీద పరుచుకొని దాని మీద పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చుని సాధన మొదలుపెట్టాలి. 
* యోగా సాధనకు ముందు ప్రశాంతంగా కనులు మూసుకోవాలి.
* మీ ధ్యాసను పూర్తిగా శ్వాసమీదే కేంద్రీకరించాలి. గాలి పీల్చి వదిలేటప్పుడు పొట్టలో కదలికలు ఉంటున్నాయో లేదో గమనించండి. 
 
* ఆసనాలు ప్రారంభంలో వజ్రాసనం లేదా పద్మాసనం వెయ్యాలి. 
* ఆసనం ఎప్పుడూ నెమ్మదిగా వెయాలి. ఏ మాత్రం తొందర కూడదు.
* ఆసనం వేసే సమయంలో ఎంత నెమ్మదిగా వేస్తామో అంతకంటే నెమ్మదిగా యథా స్థానానికి వచ్చేందుకు ప్రయత్నించాలి. 
* అధిక రక్తపోటుతో బాధ పడుతున్న వారు కుంభకంలో కేవలం పది సెకన్లు మాత్రమే ఉండాలి.
* గాలి పీల్చడం, వదలడం వంటి అసనాల్లో ఆసనాల్లో పైకి శబ్ధం వచ్చేలా వదలటం, పీల్చడం చేయకూడదు. నెమ్మదిగా సరళంగా చెయ్యాలి. ఇలా పలు జాగ్రత్తలు తీసుకుని యోగ సాధన చేయాల్సి ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu