Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భ్రమరీ ప్రాణాయామం.. ఎలా చేస్తారు.. దాని ఉపయోగాలేంటి?

భ్రమరీ ప్రాణాయామం.. ఎలా చేస్తారు.. దాని ఉపయోగాలేంటి?
, మంగళవారం, 8 డిశెంబరు 2015 (16:36 IST)
ప్రస్తుత యాంత్రిక జీవనంలో పనుల ఒత్తిడితో విశ్రాంతి తీసుకోవడం కష్టసాధ్యంగా మారింది. కానీ కాస్త సమయం తీసుకొని ఈ ప్రాణాయామాలు చేసి చూడండి. రిలాక్స్ అయి మరింత చురుగ్గా పనిచేస్తారని యోగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
ఈ ప్రాణాయామం చేసే విధానాన్ని పరిశీలిస్తే... మన్సును రిలాక్స్‌డ్‌గా ఉంచాలి. నెమ్మదిగా చేతులను మోచేతి వద్ద వంచాలి. బొటనవేళ్లతో చెవులను మూయాలి. మధ్య, ఉంగరం వేళ్లను కళ్లమీద ఆనిచ్చి ఉంచాలి. చూపుడు వేలు నుదుటి మీద వచ్చేట్లు పెట్టాలి. ఇప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుని ఓంలాంటి శబ్దం చేస్తూ గాలి వదలాలి. ఇది చేస్తున్నంతసేపు నోరు మూసి ఉంచాలి. దీనిని 10 నుంచి 12 సార్లు రిపీట్ చేయాలి. 
 
ఇలా చేయడం వల్ల తీవ్రమైన ఒత్తిడిని బయటపడొచ్చు. అధిక రక్తపోటును గణనీయంగా తగ్గిస్తుంది. స్వరపేటిక, థైరాయిడ్ వంటి గొంతుకు సంబంధించిన రుగ్మతలను తగ్గిస్తుంది. ముఖ్యంగా.. మెదడుకు విశ్రాంతినిస్తుంది. విద్యార్థులు బాగా చదివి అలసిపోయినప్పుడు ఈ ఆసనం చేస్తే మంచిది. 
 
ఇకపోతే.. భ్రమరీ ప్రాణాయామం నుంచి వెంటనే కళ్లు తెరవకూడదు. అలా చేస్తే దాంట్లో ఉన్న పూర్తి శక్తి మీకు అందదు. అందుకే ఆ ఆసనంలోనే కానీ, లేదా పద్మాసనంలో కూర్చుని రెండు చేతులు ధ్యానముద్రలో ఉంచి వీలైనంత సమయం మన ధ్యాస అంతా గాలి పీల్చుకోవడం, వదిలేయడం మీద సారించాలి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్లు తెరచినట్టయితే ఉపయోగం ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu