Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సొరియాసిస్ నుంచి సాంత్వన

Advertiesment
సొరియాసిస్
, బుధవారం, 22 ఫిబ్రవరి 2012 (05:41 IST)
సోరియాసిస్‌ని... మొండి చర్మవ్యాధిగా భావిస్తారు. తలలో మొదలయి.... శరీరం మొత్తానికి విస్తరించే ఈ వ్యాధితో చర్మం మొత్తం పొలుసుగా మారిపోతుంది. యోగాలో దీనికి ఉపశమన మార్గాలు వివరిస్తున్నారు నిపుణులు.

1. విరాసం... ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. నెమ్మదిగా ఆ ఆసనం నుంచి మారి కుడికాలిని
కుడివైపునకి, ఎడమకాలిని ఎడమవైపునకి ఉంచి కొద్దిగా పక్కకు జరపాలి. అంటే పిరుదులు రెండు నేలను తాకాలి. వెన్నెముకని నిటారుగా ఉంచి, రెంచు చేతులని రెండు మోకాళ్లపై పెట్టాలి. నిమిషం నుంచి మూడు నిమిషాల వరకూ కూర్చోకలగాలి. శ్వాస సాధారణంగా తీసుకోవాలి. ఇలా కూర్చోవటం కష్టం అనిపిస్తే.... తక్కువ సమయం నుంచి క్రమంగా పెంచాలి.
గమనికః తీవ్రమైన మోకాళ్ల నొపులు ఉన్నవారు దీనిని చేయకూడదు.

2. బెకాసనం బోర్లా పడుకొని రెండు మోకాళ్లని పైకి మడచి ఉంచాలి. కాళ్లని సాధ్యమైనంత వరకు రెండు పిరుదులు దాకా తీసుకురావాలి. కుడిచేతితో కుడికాలి వేళ్లని, ఎడమచేతితో ఎడమకాలి వేళ్లని పట్టుకొని భూమివైపు ఒత్తిపెట్టాలి. తలని పైకి లేపాలి. అరనిమిషం వరకూ ఉండి నెమ్మదిగా విశ్రాంతి స్థితిలోకి రావాలి. ఇలా రెండు నుంచి మూడుసార్లు చేయాలి.

3. వృక్షాసనం నిలబడి ఎడమ మోకాలిని నెమ్మదిగా కుడి తొడపై ఉంచాలి. ఇలా పెట్టినపుడు ఎడమకాలి వేళ్లు కిందకు చూస్తున్నట్లు ఉండాలి. మెకాలిని ముందుకు కాకుండా పక్కకు ఉంచాలి. నెమ్మదిగా రెండు చేతులనీ నమస్కార ముద్రలో పైకి సాగదీసి ఉంచాలి. ఇలా సాధ్యమైనంతసేపు ఉండి ఆ తరవాత నెమ్మదిగా విశ్రాంతి స్థితిలోకి రావాలి. శ్వాస మాములుగా ఉండాలి.

4. ఆక్యుపాయింట్లు ఆక్యుప్రెషర్ విధానంలో సొరియాసిస్ నుంచి ఉపశమనం పొందవచ్చు. చిత్రాల్లో చూపించిన విధంగా అరచేతుల్లో ఉన్న ప్రదేశాల్లో ఉపరితలం మృదువుగా ఉండే పరికరంతో ఒత్తిడి తీసుకురావాలి. ఒక్కో ప్రాంతంలో ఒకటి నుంచి రెండు నిమిషాల వరకూ ఒత్తిడి తీసుకురావాలి. చర్మ సంబంధిత సమస్యలు తగ్గేవరకు ఇలా చేయాలి.

5. శీతల ప్రాణాయామం సిద్ధాసనంలో కూర్చొని... ముందుగా ఎడమకాలి మడమని యోని కండరాలకు అనుకునేట్టుగా ఉంచాలి. దానిపై కుడికాలి మడమని పెట్టాలి. అయితే కుడికాలి పాదం వేలు లోపలకి ఉండేట్టుగా పెట్టాలి. చేతి వేళ్లు చిన్ ముద్రలో వెన్నెముకను నిటారుగా వుంచాలి. నాలుకను బయటకు ఉంచి సున్నాల చుట్టి నాలుక మధ్యలోంచి గాలిని తీసుకోవాలి. గాలిని పదిసెకన్ల పాటు బంధించి ఉంచి నెమ్మదిగా ముక్కుతో వదిలేయాలి. తిరిగి గాలిని తీసుకోవాలి. ఇలా మూడు నిమిషాలపాటు చేయాలి.


Share this Story:

Follow Webdunia telugu