Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ్యాయామానికి ముందు-తర్వాత వీటిని పాటిస్తున్నారా?

Advertiesment
వ్యాయామం
యాంత్రిక జీవనంలో అనేక మంది వివిధ రకాల వ్యాయామాలను చేస్తుంటారు. ఇవి ప్రతిరోజూ చేయడం వల్ల ఎముకలు, కండరాల నిర్మాణం, నాడీమండలం, రక్తప్రసరణ వ్యవస్థ ఇలా ప్రతి భాగం ఉత్తేజమవుతూ ఉంటుంది. ఎముకలు, కండరాల బలహీనతలు ఏర్పడడం, అనేక దీర్ఘకాల వ్యాధుల నుంచి రక్షణనిస్తుంది. అయితే, ఈ వ్యాయామం చేయడానికి తప్పకుండా క్రమ పద్దతిని పాటించాలి. ఏరోబిక్స్ వంటి వ్యాయామం చేయడానికి ముందుగా కనీసం ఐదు నిమిషాల సేపు దేహాన్ని వార్మప్, తర్వాత కూల్ డౌన్ చేసుకోవాలి.

వార్మప్ చేయడం వల్ల కండరాలు మృదువుగా కదులుతాయి. కీళ్ల కదలికలు సులువుగా మారుతాయి. చిన్నపాటి కదలికలతో దేహంలో ఉష్ణోగ్రత, గుండె కొట్టుకునే వేగం, రక్తప్రసరణ వేగం పెరుగుతాయి. కండరాలకు సరిపడినంత రక్తం అందడం, దాని వల్ల చిన్నపాటి గాయాలు వాతంటత అవే తగ్గిపోవడం వంటి ప్రయోజనాలుంటాయి.

ముఖ్యంగా శరీరంలో అన్ని అవయవాల పనితీరులో సమన్వయం పెరుగుతుంది. దేహాన్ని స్ట్రెచ్ చేసేటపుడు ఒక్కసారిగా వంచేయకూడదు. నిదానంగా రిలాక్స్ అవుతూ చేయాలి. వార్మప్‌లో భాగంగా దేహాన్ని స్ట్రెచ్ చేసేటపుడు ఒక్కొక్క దశలో పదిహేను సెకన్లు ఉండేటట్లు చూసుకుంటే మంచిది.

అలాగే, స్ట్రెచ్ చేసేటపుడు ఊపిరి బిగపట్టకుండా నిదానంగా గాలిపీల్చుకోవాలి. వ్యాయామం పూర్తయ్యాక కొద్దిసేపు కూల్‌డౌన్ చేయాలి. ఐదారు నిమిషాల సేపు మామూలు వేగంతో నిండిన తర్వాత వ్యాయామాన్ని ముగించాలి. ఇలా చేయడం వల్ల గుండె వేగం, రక్తప్రసరణ వేగం వంటివన్నీ తిరిగి మామూలు స్థితికి చేరుకుంటాయి. వార్మప్ చేయడం ఎంత అవసరమో కూల్‌డౌన్ చేయడం కూడా అంతే ముఖ్యం.

Share this Story:

Follow Webdunia telugu