Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏ ఆకులో ఏముందో తెలుసా? అదే....

మనకు ప్రకృతి ఇచ్చిన వృక్ష సంపదలో కొన్నింటికి అద్వితీయమైన ఔషథ గుణాలున్నాయి. ఏ చెట్టు ఆకులో ఏమున్నదో కొన్నింటిని గురించి తెలుసుకుందాం. 1. పుదీనా ఆకులను మెత్తగా నూరి ప్రతిరోజు రాత్రి పూట ముఖానికిరాసి ప్రొద్దుటే గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. ఈ విధంగా

ఏ ఆకులో ఏముందో తెలుసా? అదే....
, మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (18:23 IST)
మనకు ప్రకృతి ఇచ్చిన వృక్ష సంపదలో కొన్నింటికి అద్వితీయమైన ఔషథ గుణాలున్నాయి. ఏ చెట్టు ఆకులో ఏమున్నదో కొన్నింటిని గురించి తెలుసుకుందాం.
 
1. పుదీనా ఆకులను మెత్తగా నూరి ప్రతిరోజు రాత్రి పూట ముఖానికిరాసి ప్రొద్దుటే గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. ఈ విధంగా చేయటం వల్ల   మొటిమలు మచ్చలు తగ్గుతాయి.
 
2. వేపాకులను వేడి నీటిలో నానబెట్టి ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే శరీరం మీద వున్న ఎటువంటి మచ్చలయినా త్వరగా పోతాయి.
 
3. ఒక కప్పు వేపాకులను కొద్ది నీటిలో మరిగించి చల్లార్చిన తర్వాత ఆ నీటిని వడకట్టి, ఆ నీటిని ముఖానికి రాసుకుంటే ఆయిల్ స్కిన్ వారికి అస్ట్రింజెంట్‌లా పనిచేస్తుంది.
 
4. వేపాకు మరిగించిన నీటితో తలస్నానం చేస్తే జుత్తు ఊడటం తగ్గి నల్లగా పొడవుగా పెరుగుతుంది.
 
5. రాత్రిపూట దిండు మీద తులసి ఆకుల్ని వుంచుకొని పడుకుంటే తలలో పేలు పారిపోవాల్సిందే.
 
6. తులసి రసంలో కొంచెం తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే బొంగురు పోయిన గొంతు మామూలుగా అవుతుంది.
 
7. ఒక పెద్దస్పూన్ తులసి రసం ప్రతి రోజు త్రాగితే రక్తం శుభ్రపడటమే కాక గొంతు ఇన్ఫెక్షన్, కడుపునొప్పి తగ్గుతుంది.
 
8. తులసి ఆకులు మెత్తగా నూరి శరీరానికి రాసుకొని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మవ్యాధులు నయమవుతాయి.
 
9. సబ్జా ఆకు పిండి రసము తీసి చెవిలో పోసిన చెవినొప్పి తగ్గుతుంది.
 
10. మామిడి ఆకుల నుండి తీసిన పసరును కొద్దిగా వేడి చేసి చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాగి జావలో ఏమున్నదో తెలుసా?