రోజుకు మూడు ఆరటిపండ్లు ఆరగిస్తే...
మనం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకూ ఎన్నో రకాల పండ్లను తింటుంటాం. కొన్ని పండ్లు ఆయా సీజన్‌లో మాత్రమే దొరుకుతాయి. కాని అన్ని సీజన్‌లలో దొరికేపండు అరటి పండు. అందరిదకీ అందుబాటు ధరలో ఉంటుంది. చిన్నవారి నుం
మనం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకూ ఎన్నో రకాల పండ్లను తింటుంటాం. కొన్ని పండ్లు ఆయా సీజన్‌లో మాత్రమే దొరుకుతాయి. కాని అన్ని సీజన్‌లలో దొరికేపండు అరటి పండు. అందరిదకీ అందుబాటు ధరలో ఉంటుంది. చిన్నవారి నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే పండు అరటి పండు.
అలాంటి అరటి పండును రోజుకు మూడు అరటి పండ్లను తీసుకోవడం ద్వారా గుండెపోటుకు చెక్ పెట్టవచ్చనని తాజా అధ్యయనంలో తేలింది. బ్రిటీష్-ఇటాలియన్ పరిశోధనకు నిర్వహించిన అధ్యయనంలో రోజూ వారీగా మూడు అరటిపండ్లు తీసుకునే వారిలో హృద్రోగ సమస్యలు చెక్ పెట్టవచ్చునని తేలింది.
రోజూ ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌కు ఒక అరటి పండు, భోజన సమయంలో మరొకటి, రాత్రి డిన్నర్‌కు మూడో అరటిపండును తీసుకునే వారిలో శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గిస్తుంది. అలాగే మెదడు, రక్త సంబంధిత రోగాలను 21 శాతం వరకు నివారించవచ్చునని పరిశోధకులు తేల్చారు.
కాగా, స్పానిష్, నట్స్, పాలు, చేప వంటి పొటాషియంతో కూడిన ఆహారాలను తీసుకోవడం కంటే, మూడు అరటిపండ్లు రోజూవారీగా తీసుకోవడం ద్వారా గుండెపోటు, రక్తపోటు వంటి వాటిని చాలామటుకు తగ్గిపోతుందని వారు చెబుతున్నారు.
పొటాషియం అధికంగా గల ఆహారం తీసుకోవడం ద్వారా సంవత్సరానికి గుండెపోటుతో మరణించేవారి సంఖ్య అధికమవుతుందని వార్వింక్ యూనివర్శిటీ నిర్వహించిన స్టడీలో తేలింది. అయితే రోజూ మూడు అరటి పండ్లు తీసుకోవడం ద్వారా శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గించి, గుండెపోటును నియంత్రించవచ్చునని ఆ పరిశోధనలో తేలింది.