ముల్లంగిలో విటమిన్లు ఎ, బి, సి, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ వంటి అనేక ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణక్రియకు గొప్ప కూరగాయ అని పిలుస్తారు. ఐతే ముల్లంగితో కలిపి కొన్ని ఆహార పదార్థాలను తినరాదు. తింటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాము.
ముల్లంగిని తిన్న వెంటనే పాలు తాగడం వల్ల గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్, కడుపు నొప్పి వస్తుంది.
దోసకాయ, ముల్లంగిని కలిపి తినకూడదు, ఎందుకంటే దోసకాయలో వుండే ఆస్కార్బేట్, విటమిన్ సిని పీల్చుకునేలా చేస్తుంది.
ముల్లంగితో పాటు నారింజను తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ముల్లంగితో కలిపి కాకరను తీసుకుంటే ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి.
ముల్లంగి- టీ కలయిక చాలా ప్రమాదకరం, ఎందుకంటే ఇది మలబద్ధకం- ఆమ్లత్వానికి దారి తీస్తుంది.
ముల్లంగిని ఎక్కువ తింటే అది అధిక మూత్రానికి కారణమై ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావచ్చు. ఇది శరీరంలో డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది.
ముల్లంగి బ్లడ్ షుగర్‌ని తగ్గిస్తుంది, తక్కువ బిపి సమస్య వున్నవారు వీటిని తినకూడదు.