Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇవి ఆచరిస్తే గుండె ఆరోగ్యానికి ఢోకా వుండదంతే...

ఇవి ఆచరిస్తే గుండె ఆరోగ్యానికి ఢోకా వుండదంతే...
, సోమవారం, 13 జనవరి 2020 (22:11 IST)
ఇటీవలి కాలంలో కుర్చీకి అతుక్కుపోయి చేసే ఉద్యోగాలు ఎక్కవయ్యాయి. దీనితో వ్యాయామం లేకపోవడంతో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. అందుకని ఈ క్రింద చెప్పుకున్నవి ఆచరిస్తే గుండె ఆరోగ్యానికి ఢోకా లేకుండా వుంటుంది. అవేమిటో చూద్దాం. 
 
1. నడక గుండెకు మంచిది. రోజూ అరగంటపాటు నడవడం అలవాటు చేసుకోండి.
 
2. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మెట్లు ఎక్కండి. మీరు పైకి ఎక్కితే మీ రక్తపోటు తగ్గుతుంది.
 
3. పొగతాగే అలవాటు ఉంటే ఈ రోజే మానేయండి. రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడే అవకాశాలను స్మోకింగ్ మరింత పెంచుతుంది.
 
4. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.
 
5. లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, బి.పి పరీక్షలను తరచుగా చెక్ చేయించుకోండి.
 
6. బరువును నియంత్రణలో ఉంచుకోండి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోండి.
 
7. ఏడాదికొకసారి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోండి.
 
8. డయాబెటిస్ ఉంటే కనుక నియంత్రణలో ఉంచుకోండి. వ్యాయామం చేయడం మరవకండి. షుగర్ ఉన్న వారికి (ముఖ్యంగా మహిళలు) గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి.
 
9. రోజూ ఐదు రకాల పండ్లు, కూరగాయలు తినండి.
 
10. డైనింగ్ టేబుల్‌పై ఉప్పు డబ్బా లేకుండా చూసుకోండి. తినే సమయంలో అదనంగా ఉప్పు వేసుకునే అలవాటుకు స్వస్తి చెప్పండి. రోజులో ఒకటిన్నర స్పూన్(2400ఎం.జి) ఉప్పు మాత్రమే తీసుకోండి.
 
11. ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే రెండు పెగ్గుల కంటే ఎక్కువగా తీసుకోకండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శీతాకాలంలో టమోటాలు తప్పక తీసుకోవాలట.. పురుషుల్లో ఆ సమస్య?