Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీ తాగు హాయ్ హాయ్... మతిమరుపు నై నై..

టీ కెటిల్‌ నుంచి వస్తున్న కమ్మని వాసనను ఆఘ్రాణిస్తూ... గుక్క గక్కనూ ఆస్వాదిస్తూ తాగండి. అది బ్లాక్‌ టీ గానీ, గ్రీన్‌ టీ లేదా సాధారణ చాయ్‌ గానీ.... క్రమం తప్పకుండా టీ తాగేవారిలో 50 శాతం మందికి డిమెన్షియా వచ్చే అవకాశాలు చాలా తక్కువంటున్నారు పరిశోధకులు.

టీ తాగు హాయ్ హాయ్... మతిమరుపు నై నై..
హైదరాబాద్ , సోమవారం, 20 మార్చి 2017 (07:54 IST)
టీ కెటిల్‌ నుంచి వస్తున్న కమ్మని వాసనను ఆఘ్రాణిస్తూ... గుక్క గక్కనూ ఆస్వాదిస్తూ తాగండి. అది బ్లాక్‌ టీ గానీ, గ్రీన్‌ టీ లేదా సాధారణ చాయ్‌ గానీ.... క్రమం తప్పకుండా టీ తాగేవారిలో 50 శాతం మందికి డిమెన్షియా వచ్చే అవకాశాలు చాలా తక్కువంటున్నారు పరిశోధకులు. టీ ఆకుల్లో ఉండే క్యాటెచిన్స్, థియాఫ్లేవిన్స్‌ పోషకాల వల్ల మెదడు కణాలపై పడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ ప్రభావాలతో మెదడులో వాస్క్యులార్‌ డ్యామేజీ, న్యూరోడీజెనరేషన్‌ తగ్గుతాయని నేషనల్‌  యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌కు చెందిన డాక్టర్‌ ఫెంగ్‌ లీ పేర్కొంటున్నారు. 
 
అందుకే ఇకపై మతిమరపు, డిమెన్షియా, అలై్జమర్స్, పార్కిన్‌సన్స్‌ డిసీజ్‌ వంటి వ్యాధులకు దూరంగా ఉండాలనుకునేవారు కాస్త చాయ్‌పై ప్రేమ పెంచుకుంటే అది మతిమరపును ‘ఛేయ్‌’ అంటూ దూరంగా తరమేస్తుందంటున్నారు ఈ పరిశోధలకు నేతృత్వం వహించిన డాక్టర్‌ ఫెంగ్‌ లీ! కాకపోతే ఒక షరతు.... ఈ చాయ్‌ జాయ్‌ హాయ్‌లు రోజుకు మూడు కప్పులకు మించకూడదంటూ పరిమితి పెడుతున్నాడు డాక్టర్‌ లీ!!
 
జీవితంలో మతిమరపు రాకూడదని తలుస్తున్నారా జ్ఞాపకశక్తిని మెదడులోనే ఉండిపొమ్మని పిలుస్తున్నారా.. మీ సంకల్పం నేరవేరుగాక. జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉండేందుకూ, మతిమరపు (డిమెన్షియా)ను నివారించేందుకు అవలంబించాల్సిన మార్గం చాలా రుచికరమైనదీ, ఇష్టమైనదీ! మరీ మాట్లాడితే రోగి కోరేదీ అదే, పరిశోధకుడు సూచించేదీ అదే! టీని వాసన పీలుస్తూ తాగండి చాలు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొప్పాయి పాలు, బెల్లంతో కలిపి చిన్నారులకు తినిపిస్తే?