Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మినరల్ వాటర్ క‌ంటే జనరల్ వాటర్ మంచిదట‌... ప‌రిశుభ్రంగా ఉంటే...

ఒక‌ప్పుడు ఏ ఇంటి ముందు ఆగి కాస్త దాహం తీర్చ‌మంటే... రాగి చెంబుతో నీళ్ళు ఇచ్చేవారు. ఇపుడు క‌నీసం హోట‌ల్‌లోనూ తాగ‌డానికి పరిశుభ్ర‌మైన నీరు దొర‌క‌డం లేదు. అందుకే అంతా మిన‌ర‌ల్ వాట‌ర్ బాటిళ్ళు కొనుక్కోవాల్సిన దుస్థితి వ‌స్తోంది. ఇక మ‌నం నీరు తాగే ముందు అ

మినరల్ వాటర్ క‌ంటే జనరల్ వాటర్ మంచిదట‌... ప‌రిశుభ్రంగా ఉంటే...
, బుధవారం, 31 ఆగస్టు 2016 (12:24 IST)
ఒక‌ప్పుడు ఏ ఇంటి ముందు ఆగి కాస్త దాహం తీర్చ‌మంటే... రాగి చెంబుతో నీళ్ళు ఇచ్చేవారు. ఇపుడు క‌నీసం హోట‌ల్‌లోనూ తాగ‌డానికి పరిశుభ్ర‌మైన నీరు దొర‌క‌డం లేదు. అందుకే అంతా మిన‌ర‌ల్ వాట‌ర్ బాటిళ్ళు కొనుక్కోవాల్సిన దుస్థితి వ‌స్తోంది. ఇక మ‌నం నీరు తాగే ముందు అది మిన‌ర‌ల్ వాట‌రేనా అని ఆలోచించ‌డం కామ‌న్ అయిపోయింది. ఏవేవో యంత్రాల ద్వార శుద్ధి చేసిన మినరల్ వాటర్‌ని కొని అవే మంచివని లీటర్ 4 రూపాయల నుండి 25 రూపాయలు వ‌ర‌కు ఖ‌ర్చు పెడుతున్నాం. 
 
కిన్లే లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ 20/- నీరు  అమ్ముతున్నారు. కాని వాటిలో స్వచ్చత ఉందా అనే సందేహం చాలామందిలో ఉంది. కాని ఈమధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం ఏమంటే నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్‌లా అమ్ముతున్నారు. దీనివలన ప్రమాదమే కాని ఉపయోగం లేదు. రోగాలని కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారని అంటే ఆరోగ్యం కోసం అంటారు అందరూ. 
 
రోగాల బారిన పడకూడదు అనుకుంటూనే, రోగాలని కొనుక్కుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం కరిగిపోయి ఎముకలు డొల్ల అవుతున్నాయి. దీనివలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగిపోతున్నాయి. 
 
ఈ బాటిళ్ళు మ‌న సంస్కృతి కాదు...
భారతదేశంలో ఉన్న మన పూర్వికులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు. అందులో ఇది ఒకటి. నీటిని శుబ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు. వీటిని వాడటం వలన నీటిలో ఉండే సూక్ష్మక్రిములు చనిపోతాయి.
 
ఈ మధ్య జరిగిన ఒక ప్రయోగంలో ''రోబ్ రీడ్'' అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు, మట్టి పాత్రలు, ఇత్తడి, రాగి పాత్రలలో విరోచనకారి అయిన ఒక సూక్ష్మక్రిమిని వేశారు. దీనిని 24 గంటల తరువాత పరిశీలించగా, ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది. మరల 48 గంటల తరువాత పరిశీలించగా, రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99 శాతం నశించిపోయాయి. కాని ప్లాస్టిక్, పాత్రలలో వేసిన క్రిమి 24గంటలకి రెట్టింపు అయింది. 48 గంటలకి దానికి రెట్టింపు అయింది. అని కనుగొన్నారు.
 
ఈమధ్య కాలంలో అనేక స్టార్ హోటల్స్ లో రాగి పాత్రలని వాడుతున్నారు.. ఎందుకంటే వారి కష్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం కదా. రాగి, ఇత్తడి పాత్రలను వాడండి. ప‌రిశుభ్ర‌మైన నీరు తాగండి... ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విచ్చలవిడి శృంగారంతో అంటువ్యాధులు.. మందుల్ని తట్టుకుని వ్యాపిస్తాయట.. బీ కేర్ ఫుల్..