Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేసవి ఎండలో నుంచి వచ్చిన వెంటనే స్వీట్స్, తేనె తింటే ఏమవుతుంది?

* వేసవిలో ముఖ్యంగా బయటకు ఎప్పుడు వెళ్లినా, మీతో పాటు నీటిని ఉంచుకొని దాహం వేసినప్పుడల్లా గంటలో 2-3 సార్లు నీటిని తాగుతూ వుండాలి. * బాగా దాహం వేస్తుంది కదా అని కొందరు శీతల పానీయాలను తాగుతుంటారు. వాటి జోలికి వెళ్ళకండి. అవి దాహాన్ని తీర్చకపోగా, రక్తంలో

వేసవి ఎండలో నుంచి వచ్చిన వెంటనే స్వీట్స్, తేనె తింటే ఏమవుతుంది?
, బుధవారం, 26 ఏప్రియల్ 2017 (20:29 IST)
* వేసవిలో ముఖ్యంగా బయటకు ఎప్పుడు వెళ్లినా, మీతో పాటు నీటిని ఉంచుకొని దాహం వేసినప్పుడల్లా గంటలో 2-3 సార్లు నీటిని తాగుతూ వుండాలి.
* బాగా దాహం వేస్తుంది కదా అని కొందరు శీతల పానీయాలను తాగుతుంటారు. వాటి జోలికి వెళ్ళకండి. అవి దాహాన్ని తీర్చకపోగా, రక్తంలో నీరు కలిసినంత త్వరగా కలిసిపోవు. దీని ఫలితంగా దాహం మరింత పెరిగే అవకాశం ఉంది. 
* ఎండ తీవ్రంగా ఉండి బయటికి వెళ్ళినప్పుడు తల తిరుగుట లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తితే దగ్గరలో ఉన్న వైద్యుడిని వెంటనే కలవడం శ్రేయస్కరం.
* విపరీతమైన ఎండలో తిరిగి ఇంటికి రాగానే స్వీట్స్, తేనె లాంటివి తీసుకోకూడదు. అవి త్వరగా రక్తంలోనికి చేరడంతో కిడ్నీలపై ఎక్కువ భారం పడటం జరుగుతుంది. తద్వారా ఉన్న నీటిని మూత్రం రూపంలో విసర్జించడానికి అవకాశం ఎక్కువై శరీరంలోని నీటి స్థాయి తగ్గిపోవడం లాంటివి జరిగే అవకాశం ఎక్కువ.
 
* మధ్యాహ్న సమయాలలో ఆరు బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనులు చేయడం మంచిది కాదు.
* వేసవి తాపంలో శరీర సమతుల్యత పాటించడానికై పండ్లు, మజ్జిగ, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం, మసాలా కూరలు, మాంసాహార వంటకాలు తీసుకోకపోవడం తెలివైన మార్గం. 
* ఐస్ క్రీములు, శీతల పానీయాలు సేవించడంతో గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదమున్నందున, నిమ్మరసం, చెఱకు రసం, కొబ్బరి బొండాలు, పుచ్చకాయలు తీసుకోవడం ఎంతో మంచిది.
* పగటి వేళల్లో సూర్యకిరణాలు, వేడి గాలుల బారిన పడకుండా గొడుగు వాడటం ఉత్తమం. 
* ఇంట్లో గది ఉష్ణోగ్రతలు తగ్గేందుకు కిటికీలకు తడి దుప్పట్లను కానీ, వట్టివేరు చాపలను కానీ, తడికలను కట్టాలి. 
* వడదెబ్బ తగిలిన వ్యక్తి కణతలకు, గుండెకు నీరుల్లిపాయల రసాన్ని బాగా లేపనం చేయాలి. ఇలా చేస్తే అతడు త్వరగా కోలుకుంటాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతను రోజూ 4 నుంచి 5 గంటలు మాత్రమే నిద్రపోయేవారు... అందుకే అలా అయింది...