ఎలాంటి పుచ్చకాయను కొంటున్నారు.. ఇందులో ఏమి వున్నాయి?
వేసవి వచ్చిందంటే పుచ్చకాయలు, తాటి ముంజెలు, మామిడికాయలు వస్తుంటాయి. వీటన్నిటికంటే ముందుగా పుచ్చకాయ వచ్చేస్తుంది. ఆయా సీజన్లలో వచ్చే పండ్లను తినాల్సిందే. పుచ్చకాయలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉన్నాయి. ఇది పుచ్చకాయలు విరివిగా దొరికే కాలం.

హృదయ సంబంధ వ్యాధులకి, ప్రేగు కేన్సర్‌లను అడ్డుకునే శక్తి పుచ్చకాయకు ఉందని పరిశోధనలు తెలియజేశాయి. వాటిలో ఎ, బి, మరియు సి - విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. తక్కువ కెలోరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. పుచ్చకాయ రసాన్ని తాగేందుకు అనువైన పానీయం. ఎందుకంటే, అందులో 92% నీరే ఉంటుంది, పైగా కొలెస్ట్రాల్ అందులో ఉండదు.
మార్కెట్లోకి వచ్చిన పుచ్చకాయల్లో సరియైన పుచ్చకాయను ఎంచుకోవాలి. మచ్చలుగానీ, దెబ్బలుగానీ లేని నిగనిగలాడే పుచ్చకాయను ఎంచుకోవాలి. దాన్ని చుట్టూ తిప్పి చూసినప్పుడు ఒక ప్రక్క మీకు పసుపు రంగు కన్పిస్తుంది. అలా పసుపు రంగు కన్పించడం చాలా మంచి సూచన. ఆ రంగు అది సూర్య కిరణాలలో పండిందని తెలియజేస్తుంది. అది తీయగా, రసభరితంగా ఉంటుందనడానికి కూడా అదే సూచన. పుచ్చకాయను తట్టినపుడు బోలుగా ఉన్నట్టు శబ్దం వస్తే అది పండిందని అర్థం.