ఒక కప్పు నీటిలో రెండు అత్తిపళ్లను వేడి చేసి, నెల రోజుల పాటు త్రాగుట వలన కిడ్నీలో రాళ్లు తదితర సమస్యలు రావు.
2. ఉల్లిపాయను కట్ చేసి శరీరములో ఏర్పడిన గాయము వద్ద పెట్టుట వలన గాయము త్వరగా మానుటకు ఉపయోగపడును.
3. తాజా తమలపాకులు ఐదు తీసి గ్రైండ్ చేసి అందులో ఒక టీ స్పూన్ తేనె కలిపి ప్రతిరోజు రెండు లేక మూడు పూటలు తాగితే జలబు నుండి ఉపశమనం కలిగిస్తుంది.
4. ఉడకబెట్టిన స్వీట్ పొటాటోకి కాస్త ఉప్పు, పెప్పర్ కలిపి నిద్రపోవుటకు ముందు తిన్నట్లైతే డయారియాని తగ్గిస్తుంది.
5. మూడు టేబుల్ స్పూన్ నిమ్మరసం, పావు టీస్పూన్ బ్లాక్ పెప్పర్, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 కప్పు నీరు కలిపిన మిశ్రమాన్ని 3 నెలలపాటు ప్రతీరోజు తాగినట్లైతే అధికబరువును అదుపులో ఉంచవచ్చు.
6. ప్రతీరోజు పని ముగిసిన తర్వాత ఒక గ్లాసు ద్రాక్షరసం, నిమ్మరసం సమపాళ్లలో తీసుకుంటే అలసట నుంచి ఉపశమనం కలిగి ఉత్సాహంగా ఉంటారు.
7. ప్రతీరోజు తేనెతో కూడిన బిస్కెట్ తీసుకుంటే అందులోని తేనె శరీరమునకు శక్తినిచ్చి చురుకుగా ఉండేందుకు సహాయపడుతుంది. పది నుంచి 12 బాదం పప్పులను తినినట్లైతే తల నొప్పి తగ్గించును. ఈ బాదం పప్పులు రెండు మాత్రలకు సమాన గుణము కలిగి ఉంటాయి.
8. ఉదయాన్నే అలసటగా ఉన్నవారు తాజా జ్యూస్ లేక నిమ్మరసంలతో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి రోజుకి మూడు పూటలు తాగినతే అలసట తగ్గి ఉత్సాహంగా ఉంటారు.
9. స్మోకింగ్ చేయాలని కోరిక కలిగినప్పుడు నాలుక పైన కాస్త ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లైతే ఒక నెలరోజుల లోపే స్మోకింగ్ అలవాటు నిలిపేస్తారు.