అందంగా కన్పించే రోజా పూలకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ రోజా పూవులు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అవేమిటో తెలుసుకుందాము.
ఒక కప్పు రోజా రేకులతో చేసిన టీ ఆందోళనను తగ్గించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.
మొటిమలు, నల్ల మచ్చలు ఉన్న ప్రదేశంలో రోజా రేకుల ముద్దను రాసుకుంటే క్రమేపీ నల్లమచ్చలు తగ్గిపోతాయి.
రోజా పూల నుంచి వచ్చే సువాసనను పీల్చడం వల్ల శారీరకంగానే కాక మనసుకు కూడా ప్రశాంతత లభిస్తుంది.
వేడి నీటిలో రోజా రేకులు, బాత్‌సాల్ట్ వేసి ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా పీల్చితే మెదడు చురుగ్గా ఉంటుంది.
రోజా పూవులకు జీర్ణక్రియను మెరుగుపరిచే గుణం వున్నది.
రోజా పూవులలో వున్న ఫైబర్, నీటి నిల్వల వల్ల ఇవి పైల్స్ సమస్యను ఎదుర్కోవడానికి సహాయపడుతాయి.
కొద్దిగా మెంతులు, రోజా రేకులు కలిపి చేసుకున్న పేస్టును తినడం వల్ల శరీరంలో చెడు కొవ్వు తగ్గుతుంది.