వేసవిలో దప్పికను అరికట్టే రాగి జావ.. జుట్టు వత్తుగా పెరగాలంటే?
రాగి జావను పాలలో, మజ్జిగలో కలుపుకుని తాగితే.. పిల్లలకు పుష్కలమైన క్యాల్షియం అందుతుంది. రాగులతో చేసే వంటకాలను తీసుకోవడం ద్వారా జుట్టు వత్తుగా, పొడవుగా పెరుగుతుంది. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పద
రాగి జావను పాలలో, మజ్జిగలో కలుపుకుని తాగితే.. పిల్లలకు పుష్కలమైన క్యాల్షియం అందుతుంది. రాగులతో చేసే వంటకాలను తీసుకోవడం ద్వారా జుట్టు వత్తుగా, పొడవుగా పెరుగుతుంది. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. రాగులతో చేసే వంటకాల ద్వారా కడుపులో మంట తగ్గిపోతుంది. పైత్యాన్ని తగ్గిస్తుంది.
రాగుల పానీయం వేసవిలో దప్పికను అరికడుతుంది. వృద్ధులకు రాగితో చేసిన వంటకాల ద్వారా శక్తి లభిస్తుంది. మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది.
మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. రాగులలో ఉండే అయోడిన్ ఎదిగే పిల్లలకు ఎంతగానో తోడ్పడుతుంది. పిల్లల ఎదుగుదల, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.