గుమ్మడి గింజలు, అవిసె గింజలు, నువ్వులు ఏంటి ప్రయోజనం?
గుమ్మడి, అవిసె, నువ్వుల్లో పోషకాలు వున్నాయి. ఓ కప్పు వేయించిన గుమ్మడి గింజల్లో 168 మిల్లీ గ్రాముల మెగ్నీషియం వుంటుంది. అంటే ఓ మహిళ రోజువారీ అవసరాలకు కావల్సిన మెగ్నీషియంలో సగం అందుతుందన్నమాట. దీనివల్ల బలహీనంగా మారిన ఎముకల సాంద్రత పెరుగుతుంది. మూత్రపిం
గుమ్మడి, అవిసె, నువ్వుల్లో పోషకాలు వున్నాయి. ఓ కప్పు వేయించిన గుమ్మడి గింజల్లో 168 మిల్లీ గ్రాముల మెగ్నీషియం వుంటుంది. అంటే ఓ మహిళ రోజువారీ అవసరాలకు కావల్సిన మెగ్నీషియంలో సగం అందుతుందన్నమాట. దీనివల్ల బలహీనంగా మారిన ఎముకల సాంద్రత పెరుగుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. వీటిల్లోని జింక్ పోషకం, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ గింజలను ఉప్పు నీళ్లలో ఉడికించి తడి లేకుండా ఆరబెట్టి ఆపైన తక్కువ నూనెతో వేయించుకుని తింటే పూర్తిస్థాయిలో పోషకాలు అందుతాయి.
అవిసె గింజలు మేలురకం కొవ్వులకీ, ఒమెగాత్రీ ఫ్యాటీ ఆమ్లాలకు పెట్టింది పేరు. వీటిని తినడం వల్ల స్త్రీ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ లోపం లేకుండా ఉంటుంది. దీనిలోని అల్ఫాలినోలెనిక్ అనే పోషకం కండరాలకు బలాన్ని ఇస్తుంది.
నవ్వులు ఇనుము, క్యాల్షియం, మెగ్నీషియంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా వుంచే విటమిన్ 'ఇ'ని ఇస్తుంది. అందువల్ల ఆహారంలో ఈ మూడింటిని భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.