Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

కళ్ల ఆరోగ్యానికి పొన్నగంటి కూర...

ప్రస్తుత కాలంలో చదువుకునే పిల్లల్లో కంటి చూపు సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న వయసులోనే సైట్ వల్ల కళ్లజోళ్లు పెట్టుకుంటున్నారు. దానికి కారణం మనం తీసుకునే ఆహారంలో పోషకాలు సరిగా లేకపోవడమే. అయితే ప్రకృతిపరంగా, సహజంగా లభించే కొన్ని పదార్థాలతో మన కంటి

Advertiesment
Ponnaganti koora
, శనివారం, 11 ఆగస్టు 2018 (23:04 IST)
ప్రస్తుత కాలంలో  చదువుకునే పిల్లల్లో కంటి చూపు సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న వయసులోనే సైట్ వల్ల కళ్లజోళ్లు పెట్టుకుంటున్నారు. దానికి కారణం మనం తీసుకునే ఆహారంలో పోషకాలు సరిగా లేకపోవడమే. అయితే ప్రకృతిపరంగా, సహజంగా లభించే కొన్ని పదార్థాలతో మన కంటి సమస్యలను చాలావరకు మనమే పరిష్కరించుకోవచ్చు. మనం తక్కువ ఖర్చుతోనే మన కంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. చిన్న పిల్లలు స్మార్ట్ పోన్లలో ఎక్కువసేపు గేమ్స్ ఆడటం, కంప్యూటర్స్‌ని ఎక్కువసేపు చూడటం, టెలివిజన్ ముందు దగ్గరగా కూర్చుని ఎక్కువసేపు చూడటం లాంటి వాటిని పిల్లలకు సాధ్యమైనంతవరకు దూరంగా ఉంచాలి.
 
2. కరివేపాకులో ఉండే విటమిన్ ఎ కంటి చూపుని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు రెండు కరివేపాకు రెమ్మల్ని తినడం వల్ల కంటి సమస్యలు దూరమవుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
 
3. పొన్నగంటి కూర కళ్లకు మేలు చేయడంలో దానికదే సాటి. తరచూ ఈ కూర తినడం వల్ల కంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. పిల్లలకు కంటి సమస్యలు ఉంటే పొన్నగంటి ఆకు రసం ఓ కప్పు తీసుకోవాలి. దానిని నెయ్యితో కలిపి వేడి చేసి ఆ మిశ్రమాన్ని రోజకు ఓ స్పూన్ చొప్పున తాగిస్తున్నట్లయితే వారికి కంటి సమస్యలు దూరమవుతాయి.
 
4. పాలకూరలో కంటికి మేలు చేసే విటమిన్ ఎ సమృద్ధిగా ఉంది. ఇది కంటిలోని కార్నియా అంటే కంటి ముందు బాగాన్ని కప్పి ఉంచే పలుచని పొరను రక్షిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు, రసాయన సమ్మేళనాలు కంటిచూపును మెరుగుపరుస్తాయి.
 
5. క్యారెట్ మీ కంటి ఆరోగ్యాన్ని పెంపొందించే బీటాకెరోటిన్‌ని కలిగి ఉంది. ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్ ఎ కంటి చూపుని మెరుగుపరచడంతో పాటు రేచీకటి సమస్యలను నివారిస్తుంది.
 
6. మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు, కంటి చూపుని పెంచేందుకు కొన్ని పోషకాహారాలను రోజువారి ఆహారంలో చేర్చుకోవాలి. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, గింజలు, చేపలు, గుడ్లు, టొమాటో వంటి వాటిని తినడం వల్ల మీ కంటి చూపు మెరుగుపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎండిన చామంతి పువ్వుల మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే?