Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొటిమలతో చికాకు... దూరం చేయడం ఎలా...?

Advertiesment
pimples
, శనివారం, 2 ఏప్రియల్ 2016 (14:42 IST)
ముఖంపై మొటిమలు బాధిస్తుంటే.. పుదీనా ఆకుల రసం మొటిమలపై రాసి రాత్రంతా వదిలేసి ఉదయాన్నే కడిగేయాలి. చెంచా చొప్పున బియ్యం, గసగసాలూ, బాదం గింజలను తీసుకుని మెత్తగా చేయాలి. ఈ మిశ్రమానికి రెండు చెంచాల
పెరుగు కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాయాలి. పది నిమిషాల తర్వాత కడిగేస్తే మొటిమలతో పాటూ వాటి తాలూకు మచ్చలూ మాయమవుతాయి.
 
• సమపాళ్లలో సెనగపిండీ, పెరుగూ తీసుకుని మిశ్రమంలా చేసి ముఖానికి రాయాలి. ఇలా రెండ్రోజులకోసారి చేస్తే సరి. దాల్చిన చెక్క పొడిలో కాసిని నీళ్లు పోసి మొటిమలున్న చోట రాయాలి. ఇలా పదిరోజులకోసారి చేయాలి. సెనగపిండిలో కొంచెం తేనె వేసి కలిపి ముఖానికి రాయాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది.
 
• తులసి ఆకుల్ని మెత్తగా చేసి ముఖానికి పట్టించినా సరిపోతుంది. మెంతి ఆకుల్ని మెత్తగా నూరి రాత్రి పడుకునే ముందు మొటిమలపై రాసి ఉదయాన్నే కడిగేయాలి. నారింజ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేయాలి. దీనికి కొన్ని నీళ్లు చేర్చి రాత్రిపూట మొటిమలపై రాయాలి. చెంచా నిమ్మరసానికి అరచెంచా పచ్చి పాలు చేర్చి ముఖంపై రాసి అరగంట తర్వాత కడిగేసినా మంచిదే.
 
• చెంచా కొత్తిమీర రసానికి చిటికెడు పసుపు చేర్చి సమస్య ఉన్నచోట రాయాలి. ఇలా వారం పాటు క్రమం తప్పకుండా చేయాలి. కీరదోస గుజ్జును ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత కడిగేసినా ఫలితం ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu