Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బొప్పాయి ఆకులను మెత్తగా నూరి అక్కడ కడితే...?

* బొప్పాయి పండు. దీనిని చూడగానే తినాలనే కోరిక వస్తుంది. ఈ పండు పసుపు రంగులో అందంగా ఉంటుంది. ఇది స్త్రీలకు చాలా ఉపయోగకరమైనది. బొప్పాయిలో విటవిన్ ఎ పుష్కలంగా వుంటుంది. మాంసక్రుత్తుల్ని జీర్ణం చేసే పెపైన్ అనే ఎంజైమ్ కూడా వుంటుంది.

Advertiesment
papaya amaging health benefits
, శుక్రవారం, 14 జులై 2017 (18:00 IST)
బొప్పాయి పండు. దీనిని చూడగానే తినాలనే కోరిక వస్తుంది. ఈ పండు పసుపు రంగులో అందంగా ఉంటుంది. ఇది స్త్రీలకు చాలా ఉపయోగకరమైనది. బొప్పాయిలో విటవిన్ ఎ పుష్కలంగా వుంటుంది. మాంసక్రుత్తుల్ని జీర్ణం చేసే పెపైన్ అనే ఎంజైమ్ కూడా వుంటుంది.
 
* బాలింతలకు బొప్పాయ పండు ఇస్తే వారిలో సహజసిద్ధంగా క్షీరవృద్ధి జరుగుతుంది. అంతేకాదు పచ్చిగా ఉన్న కాయను తురిమి కూర వండుకుని కూడా తినవచ్చు. పాలు అప్పటికే ఇస్తున్న తల్లి కూడా తనబిడ్డకు పాలు సరిపోవడం లేదని భావించిన పక్షంలో బొప్పాయి తినడం వలన చక్కబడుతుంది.
 
* ప్రసవం అయిన వెంటనే బొప్పాయి పెట్టటం వలన గర్భంలో మిగిలి వున్న చెడు రక్తం బయటకు వచ్చి గర్భాశయ కండరాలు సంకోచించి ఆరోగ్యం బాగా వుంటుంది. రొమ్ము నొప్పి, గడ్డలు ఉంటే బొప్పాయి ఆకులను మెత్తగా నూరి రొమ్ములకు కడితే గడ్డలు కరిగి నొప్పి కూడా తగ్గిపోతుంది. నెలసరి సరిగా రాని స్త్రీలు బొప్పాయిని రోజూ తింటే సక్రమంగా ఋతువు వస్తుంది. గర్భవతులు మాత్రం బొప్పాయిని తింటే గర్భస్రావం జరుగుతుంది.
 
* బొప్పాయి చర్మవ్యాధులను అరికట్టేందుకు బాగా పనిచేస్తుంది. పేను కొరుకుడు వ్యాధికి బొప్పాయి పువ్వును నలిపి తలపైన రాస్తే మంచి ఫలితం ఉంటుంది. బట్టతల కనుక సహజంగా కాక బాహ్య కారణాల వల్ల వచ్చివుంటే ఇలా పువ్వును నలిపి రాస్తూ వుంటే కొన్నాళ్ళకు వెంట్రుకులు మొలిచే అవకాశం వుంది. బొప్పాయిలో వుండే విటమిన్ ఎ పుష్కలంగా వుంటుంది. ఈ విటమిన్ రే చీకటిని పొగొడుతుంది.
 
* బొప్పాయి తింటే మలబద్దకం తగ్గుతుంది. మొలలు కూడా తగ్గుతాయి. ముఖం పైన ఏర్పడిన శోభి మచ్చలు, నల్లమచ్చలు, బొప్పాయికాయ రసంతో నివారించవచ్చు. రసాన్ని ముఖంపై రాయడం వలన ముఖం కాంతివంతంగా ఏర్పడుతుంది. గవద కాయలు వాపును కూడా తగ్గిస్తుంది. బొప్పాయి ఆకులను మత్తగా నూరి గవదబిళ్ళల వాపుపై వేస్తే వాపు తగ్గిపోతుంది.
 
* బొప్పాయి కామెర్ల వ్యాధికి, లివర్ జబ్బులకు మంచి ఔషధం. ఈ జబ్బులకు బొప్పాయి గింజలు ఎండబెట్టి మెత్తగా దంచి పొడిగా చేసి ఆ పొడిని సీసాలో భద్రపరుచుకొని రోజూ అరచెంచా పొడికి ఒక చెంచాడు తేనె కలిపి తీసుకుంటే తగ్గిపోతాయి. సెగగడ్డలు, కురుపులు వున్నచోట పచ్చి బొప్పాయి కాయ ముక్కలుగా నూరి వాటిపై వేస్తే త్వరగా తగ్గుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆకుకూరల్ని కుక్కర్లో మూతపెట్టి వండుతున్నారా?