Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బత్తాయి రసం తాగుతాం... అందులో ఏముందసలు...?

ఆరోగ్య ప్రయోజనాలను అందించే పండ్లలో బత్తాయి ముఖ్యమైనది. పండిన బత్తాయి గుజ్జు లేత పసుపురంగులో ఉంటుంది. చాలామంది ఒలుచుకుని తిన్నప్పటికీ జ్యూస్‌ రూపంలోనే దీనికి వాడుక ఎక్కువ. బత్తాయి రసంలో పోషక విలువలతోపాటు ఔషధపరంగా కూడా బత్తాయిలో అనేక లాభాలున్నాయి. బత్త

Advertiesment
orange juice
, మంగళవారం, 23 ఆగస్టు 2016 (17:52 IST)
ఆరోగ్య ప్రయోజనాలను అందించే పండ్లలో బత్తాయి ముఖ్యమైనది. పండిన బత్తాయి గుజ్జు లేత పసుపురంగులో ఉంటుంది. చాలామంది ఒలుచుకుని తిన్నప్పటికీ జ్యూస్‌ రూపంలోనే దీనికి వాడుక ఎక్కువ. బత్తాయి రసంలో పోషక విలువలతోపాటు ఔషధపరంగా కూడా బత్తాయిలో అనేక లాభాలున్నాయి. బత్తాయిలో విటమిన్ -సి పుష్కలంగా లభిస్తుంది. పీచుపదార్థాలు, జింక్, కాపర్, ఐరన్ శక్తి, క్యాల్షియం వంటివి దాగివున్నాయి. క్యాలరీలు మరియు ఫ్యాట్ కూడా తక్కువ. 
 
ఉదర సంబంధింత రోగాలకు బత్తాయి పండ్లు చెక్ పెడతాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచే ఈ పండ్ల రసాన్ని రోజూ ఓ గ్లాసుడు తీసుకోవడం ద్వారా శరీరానికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. శరీరానికి కావలసిన ధాతువులు, పీచు పదార్థాలు, పోషకాలు ఇందులో ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు తరచూ బత్తాయి రసాన్ని తీసుకుంటే, అందులో ఉండే క్యాల్షియం, కడుపులో పెరిగే బిడ్డకు మరియు తల్లికి ఇద్దరికి అనేక ప్రయోజనాలను చేకూర్చుతుంది.
 
బత్తాయి రసంను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మరియు బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది. బత్తాయి జ్యూస్‌లోని సలవరీ గ్రంథుల నుండి సలైవాను విడుదల చేస్తుంది. ఇది తిన్నవారికి ఆహారం తేలికగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. అలాగే ఈ జ్యూస్ లోని ఫ్లెవనాయిడ్స్ పిత్తం, జీర్ణ రసాలను మరియు యాసిడ్స్‌ను విడగొడుతుంది. కాబట్టి, బత్తాయి రసం త్రాగడం వల్ల జీర్ణ సమస్యలతో పాటు, పొట్ట సమస్యలు, అజీర్ణం, వికారం మరియు కళ్ళు తిరగడం వంటి సమస్యలను నివారిస్తుంది. 
 
విటమిన్ సి లోపం వల్ల ఏర్పడే వ్యాధులను నివారిస్తుంది. ఇది దంత చిగుళ్ళ వాపుల తగ్గిస్తుంది. ఇంకా దగ్గు, జలుబు మరియు పెదాల పగుళ్ళను నివారిస్తుంది. బత్తాయి రసంలో ఉండే విటమిన్ సి ఇన్ని రకాలుగా సహాయపడుతుంది. బత్తాయి జ్యూస్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో గుండె ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది. 
 
ఒంట్లోని వేడిని బత్తాయి రసం తగ్గిస్తుంది. శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుంది. మూత్రనాళంలో మంటతో బాధపడేవారు బత్తాయి రసంలో గ్లూకోజ్ లేదా పంచదార కలుపుకుని తీసుకున్నట్లయితే మంట తగ్గటమే కాకుండా, మూత్రం సాఫీగా వస్తుంది. పెప్టిక్ అల్సర్ అన్నవాహిక, ఉదరం లేదా ఎగువ పేగు లోపలి పొర ఇన్ఫెక్షన్ సంభవిస్తే కడుపు నొప్పికి దారితీస్తుంది. కాబట్టి, ఈ బత్తాయి రసంలో యాసిడ్ గ్యాస్ట్రిక్ ఎసిడిటిని తగ్గిస్తుంది. బత్తాయి రసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకొని త్రాగడం వల్ల నోటి అల్సర్ మరియు చెడు శ్వాస నివారించబడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరక్కాయతో కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసా...?