Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేప వేర్ల కషాయాన్ని పుక్కిలిస్తే...?

తిన్న ఆహారం దంతాల మధ్య చిక్కుకుపోవడం వల్ల ఆ ప్రదేశంలో క్రిములు చేరుతాయి. దీనివల్ల చిగుళ్లవాపు, నోటి దుర్వాసన వస్తుంటాయి. అందువల్ల మెరుగైన దంతాల కోసం ఇలా చేయాలి. * తుమ్మ చెక్క కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి నూనె మిగిలేవరకూ కాచి చల్లార్చాలి. ఆ తర్వాత

వేప వేర్ల కషాయాన్ని పుక్కిలిస్తే...?
, గురువారం, 18 మే 2017 (21:20 IST)
తిన్న ఆహారం దంతాల మధ్య చిక్కుకుపోవడం వల్ల ఆ ప్రదేశంలో క్రిములు చేరుతాయి. దీనివల్ల చిగుళ్లవాపు, నోటి దుర్వాసన వస్తుంటాయి. అందువల్ల మెరుగైన దంతాల కోసం ఇలా చేయాలి.
 
* తుమ్మ చెక్క కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి నూనె మిగిలేవరకూ కాచి చల్లార్చాలి. ఆ తర్వాత దాన్ని వడబోసి ఉదయాన్నే పుక్కిట పడితే మంచి గుణం కనబడుతుంది.
 
* వేప వేర్ల కషాయాన్ని పుక్కిలిస్తే చిగుళ్లు తాజాగా వుంటాయి.
 
* పొగడ చెట్టు వేరును నీటితో మెత్తగా నూరి పాలల్లో కలిపి మూడు రోజులు ఉదయాన్నే తాగితే దంతాలు గట్టిపడతాయి.
 
* దంతాలను శుభ్రంగా వుంచుకోవడానికి వేప పుల్లతో కానీ, మర్రి ఊడతో కానీ తోముకోవాలి. దీనివల్ల దంతాల మధ్య తిష్టవేసే క్రిములు నశిస్తాయి.
 
* చిగుళ్లకు చీము పట్టి బాధిస్తుంటే 500 గ్రాముల నీటిలో 2 గ్రాముల పటిక చూర్ణ వేసి పుక్కిలించాలి. 
 
* చెరకు కర్రను పండ్లతో కొరికి నమిలి రసాన్ని మింగుతుంటే పిప్పళ్ల బాధ తగ్గుతుంది. దీనితోపాటు పళ్లు కూడా గట్టిపడతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీ, కాఫీలకు అలవాటు పడి.. తాగకపోతే తలనొప్పి ఎందుకొస్తుంది?