Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజూ కొంచెం బెల్లం తింటే... బాడీ అంతా క్లీన్!

ఇంట్లో తీపి కావాలంటే వెంట‌నే షుగ‌ర్ డ‌బ్బా తీస్తారంద‌రూ.. కానీ, ఒక‌ప్పుడు అంతా తీపి అంటే... బెల్లం వాడేవారు. ఇపుడు చాలామంది వంటింటిలో పంచదార త‌ప్ప బెల్లం ఉండ‌నే ఉండ‌దు. అయితే, బెల్లం వ‌ల్ల ఉపయోగాలు అన్నీఇన్నీ కావు. పంచ‌దార ఎక్కువ వాడితే అనారోగ్యం. అస

రోజూ కొంచెం బెల్లం తింటే... బాడీ అంతా క్లీన్!
, శుక్రవారం, 10 జూన్ 2016 (22:33 IST)
ఇంట్లో తీపి కావాలంటే వెంట‌నే షుగ‌ర్ డ‌బ్బా తీస్తారంద‌రూ.. కానీ, ఒక‌ప్పుడు అంతా తీపి అంటే... బెల్లం వాడేవారు. ఇపుడు చాలామంది వంటింటిలో పంచదార త‌ప్ప బెల్లం ఉండ‌నే ఉండ‌దు. అయితే, బెల్లం వ‌ల్ల ఉపయోగాలు అన్నీఇన్నీ కావు. పంచ‌దార ఎక్కువ వాడితే అనారోగ్యం. అస‌లు ఈ కాలంలో పాలిష్ చేసిన తెల్ల పంచ‌దార ఎంత వాడితే, అంత ఆరోగ్యానికి న‌ష్టం, క‌ష్టం. అదే, బెల్లం వాడండి... బోలెడు ఉప‌యోగాలు.
 
అవి ఏంటంటే, బెల్లం వ‌ల్ల మీ బాడీ అంతా క్లీన్ అయిపోతుంది. నిజ‌మే! ప్ర‌తి రోజు ఉద‌యం, రాత్రి కొంచెం బెల్లం తిన‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి వృద్ధి అవుతుంది. అంతేకాదు... శ్వాస నాళాలు, ఊపిరితిత్తులు, ఆహార నాళాలు శుద్ధి అవుతాయి. అంటే, మ‌నం తినే ఆహారంలో అరిగిపోగా మిగిలిన వ్య‌ర్ధాల‌న్నీ క్లీన్ అయిపోతాయి అన్న‌మాట‌. బెల్లం తింటే ర‌క్తం కూడా వృద్ధి అవుతుంది. 
 
బ‌య‌ట వాతావ‌ర‌ణంలో వేడి ఉన్నా... ఒంట్లో వేడి ఉన్నా ఒక గ్లాసులో చ‌ల్ల‌ని నీటిలో బెల్లం క‌లుపుకొని తాగితే, వేడి దిగిపోతుంది. చ‌ల‌వ చేస్తుంది. స‌హ‌జ‌మైన చెర‌కు తీపి ఉండే బెల్లం... మ‌న‌లోని నీర‌సాన్ని, నిస్త్రాణాన్ని తొల‌గించి, శ‌క్తి కూడా ఇస్తుంది. ఇంకెందుకు ఆల‌స్యం... ఇంటికి బెల్లం కొనుక్కుని వెళ్ళి ఇలా ట్రై చేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డెట్రాయిట్ నగరంలో మారుమోగుతున్న తెలంగాణం...