Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మగాళ్లలో ఆ లోపం పోవాలంటే... ఇవి పాటించాల్సిందే

ఆధునిక జీవితంలో భాగంగా పెరిగిపోతున్న మానసిక ఒత్తిడి, వాతావరణ కాలుష్యం, హార్మోన్ల లోపం, బిగుతైన దుస్తులు ధరించడం, అధిక బరువుతో పాటు ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్ల మూలంగా పురుషుల్లో తగినంత వీర్య ఉత్పత్తి జరగదని ఇప్పటికే పరిశోధనల్లో తేలింది. శుక్రకణాల

Advertiesment
మగాళ్లలో ఆ లోపం పోవాలంటే... ఇవి పాటించాల్సిందే
, గురువారం, 30 మార్చి 2017 (17:58 IST)
ఆధునిక జీవితంలో భాగంగా పెరిగిపోతున్న మానసిక ఒత్తిడి, వాతావరణ కాలుష్యం, హార్మోన్ల లోపం, బిగుతైన దుస్తులు ధరించడం, అధిక బరువుతో పాటు ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్ల మూలంగా పురుషుల్లో తగినంత వీర్య ఉత్పత్తి జరగదని ఇప్పటికే పరిశోధనల్లో తేలింది. శుక్రకణాల సంఖ్య తగినంత లేకపోవడం, ఉన్నవాటిలోనూ చురుకుదనం లోపించడం లేదా ఆ కణాల ఆకృతి బాగుండకపోవడం వలన వారి భాగస్వామికి సంతానం కలిగే అవకాశాలు సన్నగిల్లుతాయి. 
 
ఈ వీర్య కణాల సమస్యలతో సాక్షాత్తూ సౌదీ యువరాజు పాకిస్థాన్‌లో హుబారా బస్టర్డ్ అనే అడవి కోళ్ల వెంటబడ్డాడు. ఆయనే కాదు ఈ పక్షుల మాంసం కోసం అరబ్ షేక్‌లు చాలా మంది క్యూలో నిలబడతారు. వాటిని తింటే వీర్య వృద్ధి జరుగుతుందనే నమ్మకమే దీనికి కారణం. సామాన్యులందరూ ఇలాంటి పక్షులను వేటాడటమో, పాకిస్థాన్‌ నుండి దిగుమతి చేసుకోవడమో చేయలేరు కాబట్టి ఈ కొన్ని చిట్కాలతో ఎంతో ప్రయోజనాన్ని పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
అవేమిటంటే -
 
* క్యారెట్ జ్యూస్‌ని ప్రతిరోజూ తాగడం
* ఆవు నెయ్యిని ఆహారంలో భాగంగా చేసుకోవడం
* రాగులతో చేసిన అంబలి తాగడం
* బూడిద గుమ్మడి రసం, ముల్లంగి రసం, అరటిపండు, ములక్కాడలను క్రమం తప్పకుండా తీసుకోవడం
* కర్బూజా పండు, సొరగింజలు, గుమ్మడి గింజలు, దోస గింజలను తినడం
 
పైన తెలిపిన వాటితో వీర్య వృద్ధి జరగడమే కాకుండా, అంగ పటుత్వానికి, కామేచ్ఛ పెరగడానికి కూడా దోహదం చేస్తాయని నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్చిలోనే మండుతున్న ఎండలు. ఇంట్లో కర్బూజ స్టాక్ తప్పనిసరి