Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ్యాయామానికి ఒక గంట ముందు పళ్లరసంలో తేనె కలిపి తీసుకుంటే?

Advertiesment
Honey
, మంగళవారం, 18 జూన్ 2019 (11:43 IST)
తేనె శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. గుండె నొప్పి నివారిస్తుంది. ఏమాత్రం శక్తి కోల్పోకుండా బరువు తగ్గడంలో ఎంతగానో సహకరిస్తుంది. తేనెను నోటి వేసుకుని పుక్కిలించడం వల్ల దగ్గు, చిగుళ్లు వాపులు తగ్గుతాయి. తెనెను కళ్ల మీద రాసుకుంటే కంటి దృష్టి మెరుగుపడుతుంది. అంతేకాకుండా ట్రకోమా తదితర కంటిజబ్బులు నయమవుతాయి.
 
వ్యాయామానికి ఒక గంట ముందు పళ్లరసంలో కానీ, నీటిలో కానీ తేనెను కలిపి సేవిస్తే అలసట రానేరాదు. క్రీడాసక్తి ఇనుమడిస్తుంది. తక్కువ కొవ్వున్న పెరుగులో కాకుండా చేసే స్కాక్‌కి ఇది పనికి వస్తుంది. 
 
తేనెలో వుండే ముందుగా పేర్కొన్న ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటివి కండరాలు, నరాలను ఉత్తేజపరిచి మెదడను తాజాగా వుంచి నిద్రలేమిని నివారిస్తుంది.
 
నిద్రకు ముందు, నిద్ర లేవగానే తేనె ఒకటి లేక రెండు చెంచాలు సేవిస్తే ఆరోగ్యం చక్కబడి రోజంతా చలాకీగా వుంటారు. కోలుకుంటున్న రోగులకు ఇది నీరసాన్ని పోగొట్టి హుషారునిస్తుంది. రొట్టె ముక్కలపై పూసి కూడా దీన్ని వాడితే మంచి ఫలితమిస్తుంది. 
 
ఉదయం సమయాల్లో... అంటే పరగడుపున గోరువెచ్చని నీటిలో తేనెను కలుపుకుని తాగితే టాక్సిన్స్ అనే విష పదార్థాలు వ్యాప్తి చెందకుండా చేస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళల్లో వెజైనల్‌ ఇన్‌ఫెక్షన్లను దూరం చేసే పెరుగు..